Opposition Meeting: 


AIMIM తీవ్ర అసహనం..


బెంగళూరులో 26 పార్టీల భేటీపై AIMIM పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమని తాము సెక్యులర్‌ అని చెప్పుకుని తిరిగే పార్టీలు తమను దూరం పెట్టాయని మండి పడింది. విపక్షాల భేటీకి తమకు ఆహ్వానం అందలేదని వెల్లడించింది. రాజకీయ పరంగా తమ పార్టీని అంటరానిదిగా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ పార్టీని పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించింది. 


"సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు మమ్మల్ని పిలవలేదు. మేము వాళ్లకు రాజకీయపరంగా అంటరాని వాళ్లుగా కనిపిస్తున్నామేమో. ఒకప్పుడు బీజేపీలో ఉన్న నితీష్ కుమార్, ఉద్దవ్ థాక్రే, మెహబూబ్ ముఫ్తీ లాంటి నేతలంతా ఒక్కటయ్యారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించారు అరవింద్ కేజ్రీవాల్. కానీ...మళ్లీ ఆయనే ఆ పార్టీ పిలిచిన మీటింగ్‌కి వెళ్లారు. 2024లో బీజేపీని ఓడించాలని మేము కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను, నా పార్టీని పట్టించుకోవడం లేదు"


- వారిస్ పఠాన్, AIMIM నేత