Worlds Strongest Passport: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుగా సింగపూర్ నిలిచింది. జపాన్ ను వెనక్కి నెట్టి ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ దేశ పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ స్థానంలో గత ఐదేళ్లుగా జపాన్ ఉంటూ వచ్చింది. జపాన్ పాస్‌పోర్టు ఉంటే 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం 189 దేశాల్లో మాత్రమే పర్యటించవచ్చు. అలా జపాన్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ తాజాగా ఈ ర్యాంకింగ్ లను విడుదల చేసింది. 


హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ మూడు దేశాల పాస్‌పోర్టు ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ 5 స్థానాలు మెరుగుపరచుకుంది. ఈ జాబితాలో గత సంవత్సరం భారత్ 85 వ స్థానంలో ఉండగా.. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లో 80 వ స్థానానికి ఎగబాకింది. భారతదేశ పాస్‌పోర్టు ఉన్న వాళ్లు 57 దేశాల్లో పర్యటించవచ్చు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, లక్సెంబర్గ్ దేశాలు సంయుక్తం మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాల్లో పర్యటించవచ్చు. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్, యూకే నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 188 దేశాలు తిరగవచ్చు.


బెల్జియం, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోర్చుగల్, మాల్టా, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల పాస్‌పోర్టులతో 187 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ దేశాలన్నీ సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, హంగేరీ, పోలాండ్ దేశాలు ఆరో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 186 దేశాలు తిరగవచ్చు. ఏడో స్థానంలో నిలిచిన కెనడా, గ్రీన్ పాస్‌పోర్టులతో 185 దేశాల్లో విహరించవచ్చు. లిథువేనియాతో కలిసి అగ్రదేశం అమెరికా 8వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల పాస్‌పోర్టులతో 184 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంది. దాయాది దేశం పాకిస్థాన్ ఈ జాబితాలో 100వ స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది. ఈ దేశ పాస్‌పోర్టుతో కేవలం 27 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు. 


భారతదేశ పాస్‌పోర్టుతో ఏయే దేశాలు తిరగొచ్చు?


భారత దేశ పాస్‌పోర్టు ఉన్న వాళ్లు 57 దేశాలకు వెళ్లవచ్చు. వీసా అవసరం లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ తో ఈ దేశాలకు వెళ్లవచ్చు.


1. అల్బేనియా
2. బార్బడోస్
3. భూటాన్
4. బొలివియా
5. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్
6. బురుండి
7. కాంబోడియా
8. కేప్ వేర్డ్ ఐలాండ్స్
9. కమోరో ఐలాండ్స్
10. కుక్ ఐలాండ్స్
11. డొమినికా
12. ఎల్ సాల్వడార్
13. ఫిజి
14. గెబాన్
15. గ్రెనడా
16. గినియా బిసావ్
17. హైతీ
18. ఇండోనేషియా
19. ఇరాన్
20. జమైకా
21. జోర్డాన్
22. కజకిస్థాన్
23. లావోస్
24. మకావో (సార్ చైనా)
25. మడగాస్కర్
26. మాల్దీవులు
27. మార్షల్ ఐలాండ్స్
28. మారిటేనియా
29. మారిషస్
30. మైక్రోనేషియా
31. మౌంట్సెరాట్
32. మొజాంబిక్
33. మయన్మార్
34. నేపాల్
35. నియు
36. ఒమన్
37. పలావు ఐలాండ్స్
38. ఖతార్
39. రువాండా
40. సమోవా
41. సెనెగల్
42. సీషెల్స్
43. సియర్రా లియోన్
44. సోమాలియా
45. శ్రీలంక
46. సెయింట్ లూయిస్ కిట్స్ అండ్ నెవిస్
47. సెయింట్ లూయిస్ లూసియా
48. సెయింట్ లూయిస్ విన్సెంట్
49. టాంజానియా
50. థాయిలాండ్
51. తైమూర్-లెస్టే
52. టోగో
53. ట్రినిడాడ్ అండ్ టొబాగో
54.ట్యునీషియా
55. తువాలు
56. వనాటు
57. జింబాబ్వే