Opposition Meeting:



INDIAగా విపక్షాల కూటమి..


బెంగళూరులో రెండ్రోజుల భేటీ తరవాత విపక్షాల కూటమి UPA పేరుని మారుస్తూ అధికారికంగా ప్రకటించింది. INDIA (Indian National Developmental Inclusive Alliance) గా మార్చుతున్నట్టు వెల్లడించింది. దీనిపై ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఈ కూటమిలో మొత్తం 26 పార్టీలున్నాయి. చివరి వరకూ ఎన్ని పార్టీలు గట్టిగా నిలబడతాయన్నది క్లారిటీ లేకపోయినా...పేరులో "ఇండియా"ని చేర్చి చాలా స్ట్రాటెజిక్‌గా వ్యవహరించాయి. ఈ మైత్రిని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్న ఈ కూటమి ముంబయి వేదికగా మరోసారి భేటీ కానుంది. అయితే...ఇందుకోసం 11 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య వచ్చిన మార్పులను గమనించిన కూటమి...ఉద్దేశపూర్వకంగానే ముంబయిలో ఈ కమిటీ భేటీ అయ్యేలా ప్లాన్ చేసుకుంది. బయటకు అంతా కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ...అంతర్గతంగా పలు పార్టీల మధ్య విభేదాలున్నట్టు సమాచారం. ముఖ్యంగా INDIA అనే పేరుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 


ఆలోచన ఎవరిది..? 


ఇక్కడ ఆసక్తికరమైన విషయం...INDIA అనే పేరుని సజెస్ట్ చేసిందెవరు అనేదే. కొంత మంది ఇది రాహుల్ గాంధీ ఐడియానే అని చెప్పినప్పటికీ పలువురు నేతలు మాత్రం దాన్ని కొట్టి పారేశారు. రాహుల్ తరవాత గట్టిగా వినిపిస్తున్న పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె సూచనతోనే ఈ పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా INDIA అంటే Indian National Democratic Inclusive Alliance అని అంతా ఫిక్స్ అయ్యారు. శరద్ పవార్‌ ఇదే పేరుని కోట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. అఖిలేష్ యాదవ్‌ కూడా ఇదే పేరుతో ట్వీట్ చేశారు. కానీ అంతలోనే మళ్లీ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి నిముషంలో Democratic స్థానంలో developmentalని చేర్చారు.  


ఇంతకీ ఈ పేరు ప్రపోజ్ చేసిందెవరు..?


దీనిపై ఒక్కోరి వాదన ఒక్కోలా ఉంది. ఓ కాంగ్రెస్ ప్రతినిధి రాహుల్ గాంధీ సూచనతోనే ఈ పేరు పెట్టారని చెప్పగా...TMC ప్రతినిధి మమతా సలహాతోనే ఈ పేరు పెట్టారని క్లెయిమ్ చేసుకున్నాడు. మరి కొందరు మాత్రం ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని తేల్చి చెబుతున్నారు. వీటితో పాటు మరి కొన్ని పేర్లు కూడా ప్రతిపాదించారట సీనియర్లు. India's Main Front, Indian People's Front,  Indian Popular Front ,  Indian Progress Front ఇలా చాలా పేర్లు ప్రపోజల్‌కి వచ్చినట్టు కొందరు నేతలు వెల్లడించారు. అయితే..INDIA అనే పేరుని రాహుల్ గాంధీ సజెస్ట్ చేశారని, దానిపై మమతా బెనర్జీ సూచనలు అడిగారని సమాచారం. మమతా బెనర్జీ ఈ పేరులో చిన్న చిన్న మార్పులు చేశారని తెలుస్తోంది. INDIA లో N అంటే National అని రాహుల్ ప్రపోజల్ పెడితే...దాన్ని New గా మార్చాలని మమతా సూచించారట. కానీ చివరకు పలు చర్చల తరవతా నేషనల్‌ అనే పేరునే ఫైనల్ చేశారు.  


Also Read: Indian Railways: సామాన్యులకు స్పెషల్ వందే భారత్, త్వరలో అందుబాటులోకి కొత్త నాన్ ఏసీ రైలు!