Lok Sabha Speaker: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రెండు రోజుల నుంచి నడుస్తున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. లోక్‌సభ సమావేశమైన వెంటనే మిగిలిన సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్‌ ... లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్షాల నుంచి సభ్యులు అమోదం తెలపడం తిరస్కరించడం చేశారు. ఇందులో తెలుగు ఎంపీలు రామ్మోహన్, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయులు ఓం బిర్లాకు మద్దతుగా నిలిచారు.             




రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు.   మరోవైపు, స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు.                      


18వ లోక్‌స‌భ స్పీకర్‌గా ఎన్నికైన‌ ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక‌ లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన ఆయన ట్రిమ్ చేయించి కొత్తగా కనిపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారానికి కూడా టీషర్ట్ ధరించి వచ్చిన రాహుల్.. ఈరోజు ట్రెడిషనల్ పొలిటిషియన్ గెటప్‌లో ఆకట్టుకున్నారు. తెల్ల‌టి కుర్తాపైజామాలో వ‌చ్చిన ఆయ‌న‌ను కాంగ్రెస్ ఎంపీలతో పాటు, మిగతా పార్టీల నాయకులు రాహుల్ న్యూలుక్‌ను ఆసక్తిగా గమనించారు.                   


స్పీకర్ కు సోషల్ మీడియా ద్వారా పలువురు అభినందనలు తెలిపారు.  మన పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి, చిత్తశుద్ధితో, విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.                       


 





  అన్ని పార్టీల నేతలు స్పీకర్ ఓంబిర్లాకు  అభినందనలు తెలిపారు.