ఓబీసీలను గుర్తించే హక్కు రాష్ట్రాలకు ఇస్తూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. 127వ రాజ్యాంగ సవరణతో ఓబీసీ జాబితా రెడీ చేసుకునే అధికారాన్ని మళ్లీ రాష్ట్రాలకే అప్పగించింది.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్ మినిస్టర్ విరేంద్ర కుమార్ ప్రతిపాదించారు. ఈ చారిత్రక బిల్లు ఆమోదంతో... దేశవ్యాప్తంగా 671 కులాలకు లబ్ధిచేకూరనుందన్నారు మంత్రి వీరంద్రకుమార్.
ఓబీసీలో కూలాలను చేర్చుకునే రైట్ రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల చాలా వెనుకబడిన కులాలకు ఆర్థికంగా సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారాయన. దీని కోసం 342A, 338yr, 366ని కూడా సవరించాల్సి ఉందని గుర్తు చేశారు.
ఈ బిల్లుపై చర్చను కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్టార్ట్ చేశారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారాయన. 2018లో చేసిన చట్టాన్ని తప్పుపట్టారు. అప్పుడే ప్రతిపక్షాలు చేసిన సూచనలు పాటించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
102 రాజ్యంగా సవరణతో ఉద్యోగాలు, విద్యాప్రవేశాల్లో ఎస్‌ఈబీల కోటా విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మే ఐదు ఈ తీర్పు వెలువరిచింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లీ ప్రయోజనం లేకపోయిందీ. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని బీసీల జాబితా అంశంపై రాష్ట్రాలకు పవర్స్ కట్టబెట్టింది. ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి.
రాజ్యసభలో గందరగోళం...
రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెగాసస్ దుమారం, సాగు చట్టాలపై ప్రభుత్వం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ జరిపేందుకు సహకరించాలని డిప్యూటీ ఛైర్మన్ ఎంత రిక్వస్ట్ చేసినా వినిపించుకోలేదు. ఈ గందరగోళంలోనే బిల్లులు ఆమోదానికి యత్నిస్తున్న టైంలో ఎంపీలు బల్లలు ఎక్కి హంగామా సృష్టించారు. చైర్‌పైకి పేపర్లు విసిరారు. ఫైల్స్ చించేశారు. ఈ పరిస్థితుల్లోనే పెద్దల సభను రేపటికి వాయిదా వేశారు డిప్యూటీ ఛైర్మన్.
సొంత పార్టీ ఎంపీలకు మోదీ క్లాస్
పార్లమెంట్ సమావేశాలుకు డుమ్మా కొడుతున్న బీజేపీ ఎంపీలపై మోదీ అగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా అందరు ఎంపీలు సమావేశాలకు వచ్చేలా చూడాలని సీనియర్ నేతలకు సూచించారు.