తమిళనాడులోని రాణిపేట జిల్లా ఆర్కాట్ సమీపంలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మంటూ డబ్బులు వసూలు చేసిన 6 గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చోరీలో ఆదాయపు పన్ను శాఖ అధికారి కూడా ఉండటం మరో విషయం. అంతేకాదు వాళ్లకి ప్లాన్ వేసి ఇచ్చింది అతడే.  


రాణిపేట జిల్లా ఆర్కాట్‌కు చెందిన కన్నన్ వ్యాపారవేత్త. ఆర్కాట్ తో పాటు చుట్టుపక్కల ఏరియాల్లో వ్యాపారాలున్నాయి. ఒక ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎహిలరసన్ అనే వ్యక్తి కన్నన్ కు చెందిన ఇంట్లో 5 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా.. కన్నన్ నుంచి తీసుకునేవాడు. మాయమాటలు చెప్పి.. 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.  కొన్ని రోజుల తర్వాత.. ఎహిలరస్ ను కన్నన్ డబ్బులు అడగడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలో ఒత్తిడి పెట్టాడు. ఈ కారణంగా కన్నన్ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 


అయితే తనను డబ్బులు అడిగి ఇబ్బందులు పెట్టిన.. కన్నన్ పై ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలనుకున్నాడు ఎహిలరసన్. తనను డబ్బులు అడిగినందుకు.. ఇంకా డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భరత్ తోపాటు .. చెన్నైలోని తన స్నేహితుడైన మధును సలహా కోరాడు.


ఎలా డబ్బులు వసూలు చేయాలనే తెగ ఆలోచించారు. చెన్నై, నుంగంబాక్కంలోని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న రామకృష్ణన్ పరిచమయ్యాడు. అతడితో కలిసి ఎహిలరసన్ స్కెచ్ వేశాడు. ఇందుకోసం ఒక మహిళతోపాటు ఆరుగురు సభ్యుల ముఠాను ఏర్పాటు చేశాడు. ఇంకో రెండెళ్లు అయితే.. పదవీ విరమణ చేస్తుండటంతో.. ఇలాంటి పని చేస్తే.. డబ్బులు ఎక్కువ వస్తాయనుకున్న ఆదాయపు పన్ను అధికారి రామకృష్ణన్ కూడా ముఠాతో చేతులు కలిపాడు.


దోపిడి చేస ముందు రోజు కన్నన్ ఇంటి ముందు రెక్కీ వేశారు. జులై 30న, ఇన్నోవా కారులో కన్నన్ ఇంటికి వెళ్లారు. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని నమ్మించారు. ఇంటిలో తనిఖీలు చేపట్టారు. ట్యాక్స్ పే చేయని 6 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి.. అవి సర్దుకుని  అక్కడి నుంచి  బయటపడ్డారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో కన్నన్ షాక్ అయ్యారు. అయితే ఇదంతా.. సీసీ టీవీలో రికార్డు అయింది.


వెంటనే.. కన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎహిలరసన్ ను అరెస్టు చేశారు. విచారణ చేయగా అసలు విషయాన్నీ బయటపెట్టాడు. స్పెషల్ పోలీసు టీం మిగతా.. నిందితుల కోసం గాలింపు చేపట్టింది. మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.