ఆయిల్ కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై యాభై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఇకపై సిలిండర్ బుక్ చేస్తే 1052 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ సంస్థలు చెప్పాయి.
నెలనెలా గ్యాస్ సిలిండర్ల ధరలను రివైజ్ చేసే ఆయిల్ కంపెనీలు ఒకటో తేదీన కూడా రివైజ్ చేశాయి. అప్పటికి మాత్రం గృహ వినియోదారులపై భారం పడకుండా కనికరించినట్టే కనిపించాయి. కమర్షియల్ సిలిండర్‌పైనే భారం వేశాయి. ఇది జరిగి వారం తిరగకుండానే ఇప్పుడు షాక్ ఇచ్చాయి.
ఒకటో తేదీని కమర్షియల్ సిలిండర్ ధరలను కూడా భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు సిలిండర్‌పై 104 రూపాయలు వడ్డించాయి. దీంతో సిలిండర్ కాస్ట్ దాదాపు మూడువేల రూపాయలకు చేరింది. చెన్నైలో 2729 రూపాయలుగా ఉంది.
గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
గ్యాస్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ లీడర్లను నెటిజన్లు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వాళ్లు చేసిన పోరాటాల చిత్రాలు పెట్టి నిలదీస్తున్నారు.