Odisha Train Accident:



నిధుల కేటాయింపు..? 


"కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ఒడిశా రైల్వే ప్రమాదం జరిగి ఉండేదే కాదు". రెండ్రోజులుగా ఇదే వాదన వినిపిస్తోంది. దీనిపై పెద్ద డిబేట్ కూడా జరుగుతోంది. కవచ్ ఉన్నా అంత భారీ ప్రమాదాన్ని అడ్డుకుని ఉండేది కాదని రైల్వే బోర్డ్ చెబుతోంది. ఈ వాదనలు కొనసాగుతున్న క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాలాసోర్‌కి కూడా కవచ్‌కు సంబంధించిన నిధులు కేటాయించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. 2022 మార్చిలో రూ.468.9 కోట్లు కేటాయించినప్పటికీ... వాటిని ఖర్చు పెట్టలేదని సమాచారం. ఇదే జోన్‌లోని మరో సెక్టార్‌లో రూ.312 కోట్లు కేటాయించినట్టు సమాచారం. Collision Avoidance System కోసం వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. గతేడాది నుంచి ఇప్పటి వరకూ వీటినీ ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే...ఈ లెక్కలు నిజమా కాదా అన్న క్లారిటీ అయితే లేదు. కవచ్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్న వాదనలు వస్తున్నాయి కాబట్టి...కొందరు కావాలనే ఈ లెక్కలు సృష్టించారేమో అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. యాంటీ కొలిజన్ డివైజ్‌లకు కోట్ల రూపాయలు కేటాయించినా ఖర్చు చేయకుండా ఎలా ఉన్నారన్నదీ అంతు తేలకుండా ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రమాదంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై రిపోర్ట్ వచ్చేంత వరకూ ఏది నిజం, ఏది అబద్ధం అనే క్లారిటీ వచ్చేలా లేదు. 


కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్న వాదనని రైల్వే బోర్డ్ అధికారులు కొట్టిపారేశారు. ఒకవేల ఆ సిస్టమ్ ఉన్నా ప్రమాదం జరిగి ఉండేదని వెల్లడించారు. 


"కవచ్ సిస్టమ్ ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేదేమో. అసలు అది కారణమే కాదు. ప్రపంచంలో ఏ టెక్నాలజీ కూడా అడ్డుకోలేని ఘోర ప్రమాదమది. మీరు రోడ్డుపై వెళ్తుంటే ఉన్నట్టుండి బండరాళ్లు వాహనాల పైకి వచ్చి పడితే ఏం చేస్తారు? ఈ ప్రమాదమూ అలాంటిదే"


- రైల్వే బోర్డ్ అధికారులు 


గతేడాది కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ సిస్టమ్‌ని పరీక్షించారు. ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా సిగ్నల్ ఇచ్చి రైలు ఆగిపోయేలా ఈ సిస్టమ్‌ని తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్. ఓ వీడియో కూడా అప్పట్లో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "కవచ్ సిస్టమ్‌ టెస్టింగ్ విజయవంతమైంది. ఎదురుగా వచ్చే ట్రైన్‌ని గుర్తించి 380 మీటర్ల దూరంలోనే నేను ప్రయాణిస్తున్న ట్రైన్ ఆగిపోయింది"  అని వెల్లడించారు. డ్రైవర్‌లు బ్రేక్ వేయడంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటున వేయకపోయినా వెంటనే ఈ కవచ్ సిస్టమ్‌ అలెర్ట్ అవుతుంది. ట్రైన్‌ని ప్రమాదం నుంచి బయట పడేస్తుంది. అయితే...ప్రస్తుతం ప్రమాదం జరిగిన రూట్‌లో ఈ కవచ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 


Also Read: Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్