Wrestlers Protest: 


అమిత్‌షాతో భేటీ..


WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ని అరెస్ట్ చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు ఇక ఫుల్‌స్టాప్‌ పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మరో మలుపు తిరిగింది ఈ వివాదం. రెజ్లర్ సాక్షి మాలిక్ ఆందోళనను ఉపసంహరించు కుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు బజ్‌రంగ్ పునియా కూడా వెనక్కి తగ్గినట్టు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇవన్నీ తప్పుడు వార్తలని తేల్చి చెప్పింది సాక్షి మాలిక్. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకూడదని రిక్వెస్ట్ చేసింది. న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో వెనక్కి తగ్గం అని స్పష్టం చేసింది. ఉద్యోగం చేసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తానని వెల్లడించింది. 


"ఇవన్నీ తప్పుడు వార్తలు. న్యాయంకోసం మేం చేసే పోరాటంలో ఎప్పటికీ వెనక్కి తగ్గలేదు. తగ్గం కూడా. ఈ నిరసనలు కొనసాగిస్తూనే...రైల్వేలో నా డ్యూటీ నేను చేస్తున్నాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి వదంతులు వ్యాప్తి చేయొద్దు"


- సాక్షి మాలిక్, రెజ్లర్






7గురు బాధితుల్లో మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. బ్రిజ్ భూషణ్‌ శరణ్ సింగ్‌పై చేసిన ఆరోపణల్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. పటియాలా హౌజ్‌ కోర్ట్‌లో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్జ్ చేయగా...ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదయ్యాయి. దాదాపు 10 కేసులు పెట్టారు పోలీసులు. ఈ FIRలో ఆ మైనర్ రెజ్లర్‌ కూడా పలు ఆరోపణలు చేసింది. చాలా సందర్భాల్లో తనను అసభ్యంగా తాకారని చెప్పింది. కావాలనే భుజంపై చేతులు వేసి ఎక్కడెక్కడో ముట్టుకున్నాడని తెలిపింది. "నువ్వు నాకు సపోర్ట్ చేస్తే...నేను నీకు సపోర్ట్ చేస్తా" అని చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా ఇదంతా జరిగిందని  చెప్పింది. తనతో సన్నిహితంగా ఉండకపోతే వచ్చే ఛాంపియన్‌షిప్‌లలో ఆడకుండా చేస్తానని బెదిరించినట్టు...ఆ మైనర్ రెజ్లర్ తండ్రి ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు చేసి ఉన్నట్టుండి ఆమె తన స్టేట్‌మెంట్‌ని ఎందుకు వెనక్కి తీసుకుందన్నదే అంతు తేలకుండా ఉంది. 


బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు పట్టుబట్టగా, ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేసి ఛేదించడానికి పోలీసులకు సమయం ఇవ్వకూడదా అని రెజ్లర్లను అమిత్ షా అడిగారు.
శనివారం (జూన్ 3) సాయంత్రం హోంమంత్రిని ఢిల్లీలోని ఆయన ఇంట్లో కలిశారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన సమావేశం గంటకుపైగా కొనసాగిందని, దీనికి పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ హాజరయ్యారని తెలుస్తోంది. 


Also Read: Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ