ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్‌గర్ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఐదు బోగీలు ట్రాక్ తప్పి కింద పడిపోయాయి. డుంగురి నుంచి బార్‌గర్‌ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే...ఈ ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఈ ఘటనతో రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ట్రైన్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే అదుపు తప్పి పడిపోయిందని స్పష్టం చేసింది.