ఒడిశాలోని మహానదిలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు చిక్కుకుంది. శుక్రవారం నాడు పదిహేడు ఏనుగులతో కూడిన గుంపు ఆ ప్రాంతంలో నదిని దాటేందుకు ప్రయత్నించింది. అందులో ఎనిమిది నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాయి. రెండు మాత్రం వరద ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయాయి. తొమ్మిది ఏనుగురు వరదను చూసి వెనుదిరిగాయి. ఒక ఏనుగు మాత్రం నది మధ్యలో చిక్కుకుపోయింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఒడిషా డిజాస్టార్ ర్యాపిడ్  యాక్షన్ ఫోర్స్ ఆ ఏనుగును కాపాడేందుకు వెళ్లాయి. 


యాక్షన్ ఫోర్స్ సభ్యులు ఒక బోటులో తమతో స్థానిక విలేకరులు అరిందమ్ దాస్, ప్రభాత్ సిన్హాను తీసుకెళ్లారు. బోటు కటక్ జిల్లాలోని ముండలి వంతెన సమీపంలో వరద ప్రవాహానికి బోల్తాపడింది. ఈ ఘటనలో అరిందమ్ దాస్ మరణించగా, ప్రభాత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కటక్ లోని గవర్నమెంట్ ఆసుపత్రి ప్రతినిధికి సమాచారం అందింది. ప్రభాత్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు జరుగుతున్నట్టు  సమాచారం. అరిందమ్ దాస్ కు భార్యతో పాటూ రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. 


ఫారెస్ట్ అధికారి సంగ్రామ్ మొహంతి మాట్లాడుతూ ‘ఏనుగులు బాగా ఈదగలవు. కానీ ఈ ఏనుగు నదిమధ్యకు వెళ్లాక తీవ్రంగా అలిసిపోయింది. అందుకే అది మధ్యలో ఇరుక్కుపోయింది’ అని చెప్పారు. నది మధ్యలో ఏనుగు కొట్టుకుపోకుండా ఉండేందుకు ముందుగా తాము దాని చుట్టూ వలవేసినట్టు చెప్పారు సంగ్రామ్. అలాగే దానికి శక్తి కోసం కొన్ని చెట్టు కొమ్మల్ని కూడా విసిరినట్టు చెప్పారు. ఆహారాన్ని తిన్నాక శక్తి పుంజుకుని తిరిగి నదిని ఈదిందని, సురక్షితంగా అవతలికి చేరిందని తెలిపారాయన. ఏనుగు సురక్షితంగానే ఉన్నా విలేకరి చనిపోవడం అందరినీ కలచివేస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.


Also read: తాతబామ్మల ఫ్రీజర్లో 1970ల నాటి ఫుడ్... షాకైన మనుమరాలు
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
Also read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం