భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, క్వాడ్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌కు, క్వాడ్ దేశాల అధినేతలకు ప్రధాని మోదీ అరుదైన కానుకలు అందించారు. చెక్కతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఓ కళాఖండాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలికి కానుకగా ఇచ్చారు. హస్త కళల ప్రాముఖ్యతను విదేశాలలో సైతం చాటిచెప్పాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆ కానుక అందించారని తెలుస్తోంది.
కమలా హారిస్‌కు ప్రధాని మోదీ అందించిన ఆ కళాఖండాన్ని రూపొందించింది మరెవరో కాదు ఆమె తాత పీవీ గోపాలన్. పీవీ గోపాల్ హస్తకళల నిపుణుడు. తాత తయారుచేసిన చెక్క జ్ఞాపికను అందుకున్న కమలా హారిస్ చాలా సంతోషించారు. తాత చేసిన కానుకను కానుకగా అందించిన ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: 'మీ రాకకై ఇండియా ఎదురుచూస్తోంది..' మోదీ మాటలకు 'కమల' వికాసం
వారణాసి నుంచి మరో గిఫ్ట్..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు వారణాసిలో తయారైన మరో కానుకను ప్రధాని మోదీ అందించారు. గులాబీ మీనాకారి చెస్ సెట్‌ను ఆమెకు కానుకగా అందించారు. తాను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం, ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటైన కాశీ నుంచి తనకు మోదీ కానుక తీసుకురావడంపై కమలా హారిస్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె అంతర్జాతీయంగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: క్వాల్కమ్ సీఈఓ, అడోబ్ ఛైర్మన్‌తో మోదీ భేటీ.. 'డిజిటల్ ఇండియాకు' జై
క్వాడ్ నేతలకు ప్రధాని మోదీ కానుకలు..
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు వెండితో తయారుచేసిన మీనాకారి నౌక బొమ్మ (Silver Ship)ను ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపు చెక్కలతో రూపొందించిన బుద్ధుడి ప్రతిమను కానుకగా అందజేశారు. భారతీయులు, జపాన్‌ను కలపడంలో బౌద్ధ మతం పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో జపాన్ పర్యటనలో బౌద్ధ ఆలయాలను మోదీ సందర్శించారు.