అమెరికా పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్వాల్కమ్​ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టియానో ఆమోన్​తో వాషింగ్టన్​లో ఆయన సమావేశమయ్యారు. 






క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్​తో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ అందిస్తున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 5జీ, డిజిటల్ ఇండియా రంగాల్లో భారత్​తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అమోన్​ పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.


" ప్రధాని మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్‌తో భాగస్వామి కావడం గర్వంగా ఉంది. 5జీ సాంకేతికత గురించి మేం మాట్లాడాం. భారత్‌లో 5జీ విస్తరణకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి.                                                   "


                                         -క్రిస్టియానో, క్వాల్కమ్ సీఈఓ 


అడోబ్ ఛైర్మన్‌తో..






అనంతరం అడోబ్​ ఛైర్మన్​ శంతను నారాయణ్​తో భేటీ అయ్యారు. ఫస్ట్​ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్​మర్​తో చర్చలు జరిపారు. సీఈఓలతో సమావేశం సందర్భంగా భారత్​ కల్పిస్తున్న విస్తృత వ్యాపార అవకాశాలను ప్రస్తావించారు మోదీ.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌