ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వెయ్యికి పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,365 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 52,251 శాంపిళ్లను పరీక్షించగా ఈ మేరకు వెల్లడైనట్లు తెలిపింది. ఇక నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 11 మంది మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. కృష్ణాలో ఇద్దరు.. ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కోవిడ్ బాధితుల్లో 1,207 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 13,749 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.





దేశంలో కొత్తగా 31,923 కేసులు.. 

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 31,923 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైనట్లు పేర్కొంది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,35,63,421కి చేరింది. ప్రస్తుతం 3,01,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 187 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే.. ఈరోజు కోవిడ్ కేసుల సంఖ్య 18 శాతం మేర పెరిగింది. తాజాగా నమోదైన వాటిలో ఒక్క కేరళలోనే 19,675 కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 71.38 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారు. ఇప్పటివరకు మొత్తం 83.39 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేశారు.



Also Read: Covid 19 Vaccine Export: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే


Also Read: Post Covid Preganancy: పోస్ట్ కోవిడ్ పరిస్థితులు గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.