Nitin Gadkari Covid Positive: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ ప్రముఖులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో పర్యటనలకు వెళ్తున్న బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు ఒక్కొక్కరుగా కరోనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో కేంద్ర మంత్రి చేరారు. నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారాలు, సభలలో పాల్గొంటున్న నేతలు కరోనా బాధితులుగా మారుతున్నారు.
తాను కరోనా బారిన పడ్డానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కొవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ‘నాకు కరోనా సోకింది. కొవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. కుటుంబసభ్యులకు దూరంగా ఐసోలేట్ అయ్యాను. అన్ని కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తున్నాను. ఇటీవల నన్ను నేరుగా కలుసుకున్న వారు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని’ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాధా మోహన్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైకు కరోనా సోకగా.. వర్చువల్ మీటింగ్‌లలో అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ మీటింగ్ జరగనుంది. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పట్టాలని యోచిస్తున్నాయి. ఏపీలో సంక్రాంతి తరువాత నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ చేసే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన