మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముస్లిం కార్యకర్తలు తమ రంజాన్ మాసపు ఉపవాసాలను హనుమాన్ ప్రసాదం తీసుకుని ముగించబోతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజు ఎన్సీపీ పుణె ఆఫీసులో ఉత్సవాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆరున్నర గంటలకు రాష్ట్రీయ హనుమాన్ మందిర్‌లో విందు ఏర్పాటు చేశారు. ఉపవాసంలో ఉన్న ముస్లింలు విందు ఆరగిస్తారు. పుణెలో మూడు దశాబ్దాలుగా మత సామరస్యంతో అన్ని పండుగులు చేసుకుంటున్నామని నేతలు చెబుతున్నారు. 


మంత్రి కమిషన్ అడిగారని కాంట్రాక్టర్ ఆత్మహత్య ! కర్ణాటకలో రాజకీయ చిచ్చు


హనుమాన్ ప్రసాదంతో ముస్లింలు రంజాన్ ఉపవాసాలను ఉపసంహరించుకుంటున్న విషయం హైలెట్ కావడానికి కారణం.. మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్ల‌ను నిషేధించాల‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్న విషయం రాజకీయ కలకలానికి కారణంఅవుతోంది. ఏప్రిల్ 2న శివాజీ పార్క్‌లో జ‌రిగిన ర్యాలీలో రాజ్ ఠాక్రే మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్ల‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఈ చ‌ర్య చేప‌ట్ట‌ని ప‌క్షంలో మ‌సీదుల వెలుప‌ల తాము భారీ శ‌బ్ధాల‌తో హ‌నుమాన్ చాలీసా వినిపిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఏప్రిల్ 12న థానేలో జ‌రిగిన ర్యాలీలోనూ మే 3లోగా మసీదుల్లో లౌడ్‌స్పీక‌ర్లు తొల‌గించాల‌ని మ‌హారాష్ట్ర స‌ర్కార్‌కు అల్టిమేటం జారీ చేశారు.


పెట్రోల్‌ సుంకం తగ్గిదాం సార్‌! పెట్రోలియం మినిస్ట్రీకి కేంద్రం చెప్పింది వింటే షాకే!!


రాజ్ ధాకరే తీరుకు నిరసనగా 30 మందికి పైగా ముస్లిం నేత‌లు ఎంఎన్ఎస్‌కు రాజీనామా చేశారు.  ముంబై, మ‌రాఠ్వాటా, ప‌శ్చిమ మ‌హారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముస్లిం నేత‌లు పార్టీకి గుడ్‌బై చెప్పారు.మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్లు నిషేధించాల‌నే డిమాండ్‌పై రాజ్ ఠాక్రే ప‌ట్టుబ‌డుతుండ‌గా ఆయ‌న వైఖ‌రికి నిర‌స‌న‌గా ఎంఎన్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఇర్ఫాన్ షేక్ ఠాక్రేకు త‌న రాజీనామా లేఖ పంపారు.ఓ వ‌ర్గానికి వ్య‌తిరేంగా విద్వేష వైఖ‌రి తీసుకోవడం మీ వైపు నుంచి మీకు త‌ప్పుగా తోచ‌న‌ప్ప‌టికీ ఏదో జ‌రుగుతోంద‌ని త‌మ‌కు అనిపిస్తోంద‌ని త‌న రాజీనామాను ఆమోదించాల‌ని ఆయ‌న ఆ లేఖ‌లో ఠాక్రేను కోరారు.


మెట్రో స్టేషన్ పై నుంచి దూకేసిన యువతి, దుప్పటి సాయంతో రక్షించిన సీఐఎస్ఎఫ్


మత రాజకీయాల కోసమే ఇలా చేస్తున్నారని ఇతర రాజకీయ పార్టీలు అనుమానిస్తున్నాయి. అందుకే విరుగుడుగా ముస్లింలు,  హిందువులు కలిసే పండుగ చేసుకుంటున్నారని నిరూపించాలని హనుమాన్ జయంతి రోజు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా మహారాష్ట్రలో మత రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి.