ఏప్రిల్ 13వ తేదీని భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు. పంజాబ్ ప్రజలు అసలు మర్చిపోలేరు. 103 ఏళ్ల క్రితం ఇదే రోజున జలియన్ వాలాబాగ్ ఘోరకలి చోటు చేసుకుంది. ఆ రోజున 55 ఏళ్ల రెజినాల్డ్ డయ్యర్, ఇప్పుడు పాకిస్తాన్‌లోని ముర్రీలో జన్మించిన ఇండియన్ ఆర్మీలో యాక్టింగ్ బ్రిగేడియర్-జనరల్ , యాభై మంది గూర్ఖా బలూచీ రైఫిల్‌మెన్‌లు ఒక్క సారిగా విరుచుకుపడి జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన నిరాయుధులైన ప్రజలపై హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారు.  15 నుంచి 20,000 మంది భారతీయులు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ అని పిలిచే సమావేశ ప్రాంతం వద్ద సమావేశమయ్యారు. అక్కడ డయ్యర్ ఇచ్చిన ఆదేశాలతో కాల్పులు జరిపారు. బ్రిటిష్ దళాల వద్ద మందుగుండు సామగ్రి అయిపోయిన తర్వాతనే కాల్పులు ముగిశాయి. వారి వద్ద ఉన్న బుల్లెట్లన్నింటినీ జనం శరీరాల్లోకి దింపేశారన్నమాట.  1650 రౌండ్లలో చాలా వరకు ప్రజల శరీరాల్లోకి దూసుకెళ్లాయి. అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించారు మరియు 1,200 మంది గాయపడ్డారు. ఎంత మంది మరణించారనే దానిపై కొన్ని అంచనాల ప్రకారం దాదాపు 1,000 మంది ఉన్నారు. సల్మాన్ రష్దీ నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌లో కథకుడు సలీమ్ గుర్తుచేసుకున్నట్లుగా  కాల్పులు ముగిసిన తర్వాత డయ్యర్ తన బలగాలతో " గుడ్ షూటింగ్ " అంటూ కామెంట్ చేశాడు. "మేము ఒక మంచి పని చేసాము." అని నిర్మోహమాటంగా రికార్డు చేసుకున్నారు. 


ఆ రోజు బైసాఖీ పర్వదినం. అమృత్ సర్‌తో పాటు నగరం మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు స్వర్ణ దేవాలయం సందర్శనకు వచ్చారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల జనం ఉన్నారు. ఆ రోజు పండుగ కాబట్టి సందడిగా ఉంది.. కానీ  అంతకు ముందు రోజులు అనిశ్చితి, హింసతో  గడిచిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు పదివేల మంది తమ ప్రాణాలను అర్పించినప్పటికీ ఇది రి స్వంత యుద్ధం కాదు,  యుద్ధం ముగింపులో వారు అణచివేతతో బహుమతి పొందారు. 1918 మధ్యలో, "మాంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు" కారణంగా భారతీయ కేంద్ర  ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లకు పరిమిత అధికార వికేంద్రీకరణకు దారితీసింది. భారతీయ ఉదారవాదుల దృక్కోణం నుండి, ఈ సంస్కరణలు చాలా తక్కువగా  చాలా ఆలస్యంగా జరిగాయి.  భారతీయ జాతీయవాదులలో కొంత మంది బ్రిటిష్ వారి నుండి చాలా ఎక్కువ రాయితీల కోసం పట్టుబట్టారు.  ఇతరులు వ్యతిరేకించారు. తర్వాత  జస్టిస్ రౌలట్ నేతృత్వంలో భారత స్వాతంత్ర్య విప్లవాత్మక కుట్రలపై విచారణకు నియమించిన కమిటీ పౌర హక్కులను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. అణచివేత చట్టాన్ని వేగంగా అమలు చేసింది. జాతీయవాద ఆందోళనను అణిచివేసే ప్రయత్నంలో బ్రిటీష్ నిరోధక నిర్బంధాన్ని ఆశ్రయించింది. ఈ విషయాన్ని 1919 ప్రారంభంలో ఒక లాహోర్ వార్తాపత్రిక "నో దలీల్, నో వకీల్, నో అప్పీల్" అనే పేరుతో ప్రచురించింది. 


అప్పటికి మోహన్‌దాస్ గాంధీ గాంధీ  దక్షిణాఫ్రికాలో తన ఇరవై ఏళ్ల ప్రవాసం నుండి భారతదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్లయింది. రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా సాధారణ హర్తాల్ పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తాను పిలుపునిచ్చిన హర్తాల్‌కు వచ్చిన స‌్పందన గురించి తన జీవతి కథలో  "భారతదేశం మొత్తం ఒక చివర నుండి మరొక చివర వరకు, పట్టణాలు మరియు గ్రామాలు" అని గాంధీ రాశారు. ఆ సమయంలో పంజాబ్‌ ను సర్ మైఖేల్ ఓ'డ్వైర్  పరిపాలిస్తున్నారు.. ఆయన నిరంకుశ పాలనను ధృడంగా విశ్వసిస్తాడు. అంతే కాదు తనను తను భారతీయ రైతుల రక్షకునిగా భావించుకుంటాడు.  రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని , ద్రోహపూరిత పట్టణ భారతీయ ఉన్నతవర్గాలకు రక్షణ పొందాలని ఆయన భావిస్తూ ఉంటారు.  రెజినాల్డ్ డయ్యర్ తరహాలోనే తరచూ ఆవేశానికి గురవుతూంటాడు. ఓ'డ్వైర్ ఐరిష్ జాతికి చెందినవారు. ఐరిష్‌లు ఆంగ్లేయుల అణిచివేతకు గురైనవారు.  అందుకే  ఓ'డ్వైర్ అధికార ధిక్కారాన్ని ఏమాత్రం సహించలేరు.  1857-58లో పంజాబ్ తిరుగుబాటును అణిచి వేశారు. భారత స్వాతంత్ర్య పోరాటం... బ్రిటిషన్ రూలర్స్‌లో ఓడ్వైర్‌కు ప్రత్యేకత ఉంది.  తిరుగుబాటును అణచివేయడంలో సిక్కుల సహాయాన్ని పొందడంలో కీలకమైనది. "లా అండ్ ఆర్డర్" ను నిలబెట్టడం కంటే ప్రభుత్వానికి గొప్ప పని లేదు అని నమ్ముతూంటారు. గాందీ ప్రారంభించిన ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ సారి " వారి లెక్కలు చూసే రోజు దగ్గరలోనే ఉందని "  హెచ్చరించారు.


జలియన్‌వాలాబాగ్‌లో మారణకాండ జరగడానికి కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. డిప్యూటీ కమీషనర్ మైల్స్ ఇర్వింగ్ అనుకోకుండా ఏప్రిల్ 9న ఓ'డ్వైర్‌కు టెలిగ్రామ్‌లో అమృత్‌సర్‌లోని ముస్లింలు,  హిందువులు "ఐక్యత" కలిగి ఉన్నారని సందేశం పంపారు. ఇది బ్రిటిష్ వారిని మరింత ఆందోళనకు గురి చేసింది.  హిందువులు , ముస్లింలు సమైక్యంగా ఉండటం ఆందోళనకరమని వారు భావించారు. వెంటనే  ఇద్దరు స్థానిక నాయకులు డాక్టర్ సత్యపాల్ , డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లేలను అరెస్టు చేసి పంజాబ్ నుంచి బహిష్కరించారు.  దీనికి వ్యతిరేకంగా  భారతీయులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో ఇరవై మంది భారతీయులు మరణించారు. బ్రిటీష్ ఆధీనంలోని బ్యాంకులపై జనం దాడి చేశారు. అయితే ఆ సమయంలో బ్రిటిష్ మగిళమార్సియా షేర్‌వుడ్‌పై దాడి జరిగింది. ఇది ఆంగ్లేయులకు మరింతగా కోపం తెప్పించింది.  ఆమె తీవ్రంగా కొట్టారు కానీ రక్షించింది కూడా ఇతర భారతీయులే. అయితే వలసవాద పాలకుల పురుషులు ఆమెను అలా భారతీయులు కొట్టడాన్ని అవమానంగా భావించారు.  వారి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే మిస్ షేర్‌వుడ్‌పై దాడి చేసిన వీధికి నిర్బంధించారు. ఎవరైనా అటూఇటూ వెళ్లాలనుకుంటే కొరడా దెబ్బలు కొట్టేవారు.  దీన్ని క్రాలింగ్ లైన్‌గా అభివర్ణించేవారు.


"క్రాలింగ్ లేన్"ని జాతీయ అవమానకరమైన ప్రదేశంగా గాంధీ అభివర్ణించారు.  జలియన్‌వాలాబాగ్‌లో కాల్పులు ఆగిన తర్వాత, గాయపడిన వారికి సహాయం చేయడానికి డయ్యర్ ప్రయత్నించలేదు. అతను తరువాత తన సహాయం కోసం ఎవరూ అడగలేదని చెప్పాడు- కసాయి నుండి సహాయం కోసం ఎవరు అడుగుతారు..? ఎవరైనా అడగవచ్చు అడగకపోవచ్చు కానీ.. నిజమైన సైనికుడిగా.. న్యాయధికారిగా తన పని కాదని ఒప్పుకోవడం ద్వారా ద్రోహం చేశాడని అంగీకరించిటన్లయింది.  గాయపడిన వారికి సహాయం చేయాలని ఎవరైనా అడిగితేనే చేస్తారా..?  నగరంలో  యుద్ధ చట్టం అమలు చేస్తున్నారు.  అమృత్‌సర్‌లో డయ్యర్ తీసుకున్న చర్యలకు తన ఆమోదాన్ని తెలిపిన ఓ'డ్వైర్, 1857-58 నాటి తిరుగుబాటును గుర్తుచేసే భయంకరమైన పరిస్థితి నుండి పంజాబ్ రక్షించబడిందని ఖచ్చితంగా చెప్పాడు. వాస్తవానికి భారతీయుల్లో పెరుగుతున్న తిరుగుబాటును అణిచి వేయడానికి జలియన్ వాలాబాగ్‌లో రక్తపాతాన్ని సృష్టించి ప్రజల్లో భయం పెంచేందుకు ప్రయత్నించారనేది అందరికీతెలిసిన విషయం. 


భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు ఒక బలీయమైన సంస్థ.  రాజకీయాలు ప్లెబియన్ నిరసన దశలోకి ప్రవేశించాయని బ్రిటిష్ వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. డయ్యర్ తన స్వంత అంగీకారంతో  తాను "చెడ్డ" భారతీయులగా భావించే వారికి "పాఠం నేర్పడానికి"   చట్టబద్ధమైన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు.  ఈ అరాచకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో  స్కాట్లాండ్‌కు చెందిన లార్డ్ విలియం హంటర్ అధ్యక్షతన డిజార్డర్స్ ఎంక్వైరీ కమిషన్ నియమించారు.  ఆ మరకను తుడిపేసుకుని బ్రిటిషన్ పాలకులు మంచివారు అని చెప్పడమే ఆ ఎంక్వయిరీ కమిషన్ లక్ష్యం.   భారతదేశంలోని చాలా మంది బ్రిటీషర్లు లండన్ నుండి భారతీయ వ్యవహారాల్లోకి చొరబడడం పట్ల ఆప్పటికే ఆగ్రహం వ్యక్తమవుతోంది.  జలియన్ వాలాబాగ్ ఘటన వల్ల డయ్యర్ తిరుగుబాటు లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే తాను "అక్కడిమనిషి"గా చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు.  నెలల తర్వాత, డయ్యర్ తన కమీషన్‌కు రాజీనామా చేయవలసి వచ్చింది. డయ్యర్ తప్పు పని చేశారని బ్రిటన్‌లో చాలా మంది కూడా అంగీకరించారు. అయితే విపరీతమైన జాత్యహంకార భావన ఉన్న బ్రిటీష్ ప్రజలు అతని పేరు మీద ఒక ఫండ్‌ను తెరిచారు. ప్రస్తుతం  ఆధునిక క్రౌడ్ ఫండింగ్ అనే పేరు ఉంది. దీన్ని అప్పట్లోనే డయ్యర్ కోసం బ్రిటిష్ ప్రజలు ప్రారంభించారు. డయ్యర్ కోసం 26 వేల పౌండ్లు సేకరించారు. ఆ ఆరోజుల్లో 26వేల పౌండ్లు అంటే.. ఈ రోజు 1.1 మిలియన్ల పౌండ్లతో సమానం. ఈ కారణంగా  "అమృత్‌సర్‌ కసాయి" విలాసవంతమైన పదవీ విరమణ చేశాడు.  


భారత్‌ను బ్రిటిష్ పాలకులు పరిపాలించిన కాలంలో ఈ పంజాబ్ పరిణామాలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చాలా మందికి, భారతీయులకు కూడా, జలియన్‌వాలాబాగ్ ఊచకోత మాత్రమే గుర్తుంది, అయితే "క్రాలింగ్ లేన్" ఆర్డర్ భారతీయ మనస్సుపై మరింత పెద్ద గాయం అని గాంధీ తన మనస్సులో స్పష్టంగా ఉంచుకున్నారు. పంజాబ్‌లో బ్రిటిష్ వారు సృష్టించినది భయానక పాలన. కాంగ్రెస్ దాని మీద స్వంత విచారణ కమిటీని నియమించింది.  అధికారిక హంటర్ కమీషన్ కంటే బ్రిటిష్ చర్యలపై ఇది చాలా కఠినమైన అభిప్రాయాన్ని తీసుకుంది. భారత వ్యవహారాలు పార్లమెంటులో ఎన్నడూ పెద్దగా దృష్టి పెట్టలేదు, కానీ, అసాధారణంగా, జలియన్‌వాలాబాగ్ దురాగతం దాని అనంతర పరిణామాలు కామన్స్‌లో మరియు లార్డ్స్‌ సభలో తీవ్రంగా చర్చించారు.  భారతదేశానికి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మోంటాగు కామన్స్‌లో విచారణను ప్రారంభించి, డయ్యర్ ఒక అధికారిగా ఖ్యాతిని కలిగి ఉన్నాడని అతని ప్రవర్తన "గాలెంట్"గా ఉందని చెప్పుకొచ్చారు.  డయ్యర్ సామ్రాజ్యానికి చేసిన సేవ గొప్పదన్నాడు.  ఏది ఏమైనప్పటికీ, "మొత్తం పంజాబ్‌కు నైతిక పాఠం చెప్పాలనే" ఉద్దేశ్యంతో తప్ప ఎక్కువ ప్రాణనష్టం చేయడానికి కాదనే వాదనతో తన చర్యలను సమర్థించుకున్నారు.  అయితే ఇవన్నీ నిలబడలేదు. చివరికి మెంటాగు కూడా ఫలితం అనుభవించాడు. ఆయనను 1922లో రాజకీయాల నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 


జలియన్‌వాలాబాగ్ మారణకాండపై భారతీయుల స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి పాఠశాల చరిత్ర పాఠ్య పుస్తకంలో ఠాగూర్ వైస్రాయ్‌కి ఎలా హృదయాన్ని కదిలించే లేఖ రాశారో చిన్నతనంలోనే చదువుకున్నారు. నాగరిక ప్రభుత్వాల చరిత్రలో ఇలాంటి దుర్ఘటన మరోసారి జరగకూడదు.  ఊచకోత ఘటన నుంచి ప్రాణాలతో బయటపిన 20 సంవత్సరాల వయస్సు ఉన్న ఉధమ్ సింగ్ 20 ఏల్ల తర్వాత ఓ'డ్వైర్ లండన్‌ోల ఇస్తున్న ఓ ఉపన్యాసానికి హాజరై.. కాక్స్‌టన్ హాలులోకి చొరబడి  రివాల్వర్‌తో కాల్చి చంపాడు.  విశేషమేమిటంటే, ఇంగ్లీషు భాషపై తనదైన అసాధారణ నైపుణ్యంతో డయ్యర్ పేరును డయ్యరిజం అనే  ఒక భావజాలంగా మార్చుకున్న ఏకైక వ్యక్తి డయ్యర్. అతను తన ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత వహించడు. పైగా ప్రజల్ని పీడించాన్ని డయరిజంగా చెప్పుకుంటాడు.  జలియన్‌వాలాబాగ్ మారణకాండ, పంజాబ్‌లోని దురాగతాలపై 1922లో గాంధీ తన విచారణలో అతని గురించి  "రాజీలేని అసంతృప్తివాది"గా పేర్కొన్నాడు.  అతను   "భారతదేశాన్ని రాజకీయంగా మరియు ఆర్థికంగా మునుపెన్నడూ లేని విధంగా నిస్సహాయంగా మార్చిన." విషయంలో కీలక వ్యక్తిగా గాంధీ చెబుతారు. 


జలియన్ వాలాబాగ్ ఘటనపై హౌస్ ఆఫ్ కామన్స్‌లో చర్చ సందర్భంగా విన్‌స్టన్ చర్చిల్  బ్రిటీష్ సామ్రాజ్యం ఆధునిక చరిత్రలో ఇక ముందు జరగకూడని ఘటనగా పేర్కొన్నారు.  "ఇది ఒక అసాధారణ సంఘటన, ఒక భయంకరమైన సంఘటన, ఇది ఏకపక్ష కాల్పులు.. తప్పుడు నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.   అయితే ఆ సంఘటనను "ఏకపక్షమని ఏ కొలతతో వర్ణిస్తాము? రెండు దశాబ్దాల తర్వాత యుద్ధకాల ప్రధానమంత్రిగా ఉన్న  చర్చిల్ బెంగాల్‌లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న లక్షలాది మంది దుస్థితిపై ఉదాసీనంగా ఉన్నారు. దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజల మరణానికి అది దారి తీసింది.   చర్చిల్, తన జీవితమంతా జాత్యహంకారి ఉన్నారు. చర్చల్లో ఆంగ్ల ధర్మాలకు సంరక్షకుడిగా కనిపించేందుకు ప్రయత్నించారు.  


జలియన్‌వాలాబాగ్‌లో ఎంతో ఘోరమైన దురాగతం జరిగినా  ఇప్పటికీ బ్రిటిష్ పాలకులు దాన్ని లెక్కలోకి తీసుకోరు.  బ్రిటీష్ వారు ఇప్పుడు ఉన్నట్లే అప్పుడు కూడా  పశ్చాత్తాపం చెందలేదు. భారతదేశంలో బ్రిటీష్ పాలన 75 సంవత్సరాల క్రితం ముగిసినప్పటికీ వారి లెక్క సరి చేసే రోజు ఇంకా రాలేదు..


 


( రచయిత : వినయ్ లాల్ , రైటర్,  బ్లాగర్, యూసీఎల్‌లో హిస్టరీ ప్రోపెసర్ )


[ డిస్‌క్లెయిమర్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు మరియు ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ABP న్యూస్ నెట్‌వర్క్ Pvt Ltd యొక్క అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలను ప్రతిబింబించవు. ]