ABP  WhatsApp

Hanuman Chalisa row: వెక్కి వెక్కి ఏడ్చిన నవనీత్ రాణా- ఓదార్చిన భర్త, వీడియో వైరల్!

ABP Desam Updated at: 06 May 2022 05:27 PM (IST)
Edited By: Murali Krishna

Hanuman Chalisa row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఏడుస్తోన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వెక్కి వెక్కి ఏడ్చిన నవనీత్ రాణా- ఓదార్చిన భర్త, వీడియో వైరల్!

NEXT PREV

Hanuman Chalisa row: మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కన్నీరుమున్నీరుగా విలపించారు. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయిన నవనీత్ దంపతులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే నవనీత్ విడుదలైన వెంటనే అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో నవనీత్ రాణా విలపిస్తుండగా భర్త రాణా ఓదారుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






పట్టించుకోలేదు


తలోజా జైలు నుంచి గురువారం రవిరాణా విడుదలయ్యారు. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలు నుంచి ఆయన భార్య నవనీత్‌ కౌర్‌ రాణా విడుదలయ్యారు. అయితే నవనీత్‌ రాణా అనారోగ్య సమస్యలతో సబ్‌ అర్బన్‌ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.  


తన భార్య నవనీత్‌ కౌర్‌ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే రవి రాణా ఆరోపించారు.



గత ఆరు రోజుల నుంచి నవనీత్‌ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు.                                                                          -    రవి రాణా, ఎమ్మెల్యే


ఇదీ జరిగింది


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్‌ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో వీరిద్దరినీ ముంబయి పోలీసులు గత నెల 23న అరెస్టు చేశారు. వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.


Also Read: Indian IT Firm: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!


Also Read: Chennai News: పార్టీ లేదా పుష్పా! అన్నావ్- ఇస్తే బిర్యానీతో పాటు నగలు కూడా మింగేశాడు!

Published at: 06 May 2022 05:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.