ABP  WhatsApp

Indian IT Firm: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!

ABP Desam Updated at: 06 May 2022 04:16 PM (IST)
Edited By: Murali Krishna

Indian IT Firm: ఉద్యోగులను ఎక్కడికి పోకుండా తమ కంపెనీలోనే ఉంచుకునేందుకు ఓ ఐటీ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటో మీరూ చూడండి.

పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!

NEXT PREV

Indian IT Firm:


కరోనా సంక్షోభం మొదలైన తర్వాత చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను కోల్పోయాయి. చాలా మంది ఉద్యోగులు వేరే సంస్థల్లోకి మారిపోయారు. దీనికి తోడు ఐటీ సంస్థలు కూడా కొత్తగా కంపెనీలోకి వచ్చేవారికి భారీగా జాయినింగ్ బోనస్‌లు ఇచ్చి మరీ తీసుకున్నాయి. దీంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు భారీ హైక్‌లు, ఆఫర్లు ప్రకటించాయి. తమిళనాడు మధురైకు చెందిన ఓ ఐటీ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే?


పెళ్లి చేసుకోరా నాయనా


మిగిలిన ఐటీ కంపెనీలతో పోలిస్తే ఈ సంస్థ ఇచ్చిన ఆఫర్ ప్రత్యేకం. అదేంటంటే పెళ్లి కాని తమ ఉద్యోగులు సంస్థలోనే మేచింగ్ చూసుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే అదే కంపెనీలో పని చేసే మరో ఉద్యోగిని వాళ్లు పెళ్లి చేసుకోవచ్చన్నమాట. చేసుకుంటే మాకేంటి అని ఉద్యోగులు అనుకో అక్కర్లేదు. ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకునే ఉద్యోగులకు కంపెనీ భారీగా హైక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. వారి సంస్థలో ఈ ఆఫర్‌కు దాదాపు 750 మంది అర్హులున్నారు.


భారీ హైక్


అంతేకాకుండా ప్రతి ఏడాది రెండు సార్లు 6-8 శాతం హైక్ ఉద్యోగులు ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అదే ఈ పెళ్లి ఆఫర్‌ కూడా వాడుకుంటే వీటితో పాటు స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా పడుతుందట.



నా సంస్థలో ఉద్యోగులు నన్ను ఓ సోదరుడిలా భావిస్తారు. కంపెనీలో పని చేసే వారిలో చాలా మంది గ్రామాల్లో పుట్టి పెరిగినవాళ్లే. వారికి వయసైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీంతో కరెక్ట్ మేచింగ్ చూసుకునే అవకాశం వారికి తక్కువగా ఉంది. దీంతో సంస్థలోనే పెళ్లి చూసుకునే అవకాశం కల్పించాను. ఆ పెళ్లికి మా కంపెనీలో ఉద్యోగులంతా కచ్చితంగా హాజరవుతాం. దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు ఐదేళ్లుగా మా సంస్థలోనే ఉన్నారు.                                                                   -      ఎమ్‌పీ సెల్వగణేశ్, మూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్ ఎండీ


Also Read: Chennai News: పార్టీ లేదా పుష్పా! అన్నావ్- ఇస్తే బిర్యానీతో పాటు నగలు కూడా మింగేశాడు!


Also Read: White House Press Secretary: జో బైడెన్ సంచలన నిర్ణయం- హై ప్రొఫైల్ పదవికి ఓ LGBTకి ఛాన్స్

Published at: 06 May 2022 04:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.