White House Press Secretary: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష భవనం శ్వేతసౌధం తదుపరి ప్రెస్ సెక్రటరీగా నల్లజాతీయురాలైన కరీన్ జీన్ పియర్ (44)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరో నల్లజాతీయులకు కీలక పదవిని బైడెన్ ఇచ్చినట్లు అయింది.
తొలిసారి
అమెరికాలో అత్యున్నత స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా ఆమె రికార్డుల్లో నిలిచారు. అందులోనూ కరీన్ జీన్ పియర్ LGBTQ+ వ్యక్తి (LGBTQ+.. లెస్బియన్, గే, bisexual, ట్రాన్స్‌జెండర్) కావడం విశేషం. ఆ పదవిలో LGBTQ+ వ్యక్తి ఉండటం కూడా ఇదే మొదటిసారి.
జీన్ పియర్ వైట్ హౌస్‌లో చేరడానికి ముందు ఎన్నికల సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తరఫున ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పని చేస్తున్న జెన్ పాకి పదవీకాలం ఈనెల 13వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో జీన్ పియర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అంతా మనోళ్లే
బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లు ఉన్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు.
Also Read: Viral Video: ఇదేం కొవిడ్ టెస్ట్ రా నాయనా! కింద పడేసి, మీద కూర్చొని!
Also Read: China Building Collapse: కుప్పకూలిన 6 అంతస్తుల భవనం- 53కు చేరిన మృతుల సంఖ్య