WHO on Covid Death: దేశంలో కరోనా వైరస్ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య భారతదేశం 4.7 మిలియన్ల కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు సంభవించాయని గ్లోబల్ హెల్త్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు అధికారికంగా నమోదైన దాని కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది. కరోనాతో మొత్తం సుమారు 14.9 మిలియన్ల మరణాలు సంభవించాయని వెల్లడించింది.
డబ్ల్యూహెచ్వో గణాంకాలపై అభ్యంతరం
WHO కరోనా మరణాలపై తన నివేదికను విడుదల చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా అదనపు మరణాలను అంచనా వేసిన విధానంపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. WHO నివేదికను తప్పుబట్టింది. కరోనా మరణాల అంచనా మోడల్, డేటా సేకరణ సందేహాస్పదంగా ఉందని పేర్కొంది. ఈ మోడల్ పద్దతి, ఫలితాలపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, WHO భారతదేశ ఆందోళనలను తగినంతగా పరిష్కరించకుండానే అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది.
Also Read : Driving License In Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు ఇక నో డ్రైవింగ్ లైసెన్స్- తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
భారత్ టైర్ II లో ఉండదు
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విడుదల చేసిన డేటాను కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. భారతదేశంలో కరోనా మరణాల సంఖ్యను అంచనా వేయడానికి గణిత నమూనాలను ఉపయోగించరాదని తెలిపింది. "భారతదేశంలో జననాలు, మరణాల నమోదు చాలా పటిష్టమైంది. దశాబ్దాల నాటి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీటిని నమోదుచేస్తున్నాం" అని కేంద్రం పేర్కొంది. మే 3 నాటికి భారతదేశంలో అధికారికంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 522,676. ప్రపంచ దేశాలను టైర్ I, II కేటగిరీలుగా వర్గీకరించడానికి WHO ఉపయోగించే ప్రమాణాలు సరిగా లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. WHO భారతదేశాన్ని రెండో కేటగిరీలో చేర్చింది. చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా సేకరించిన మరణాల డేటా కచ్చితత్వాన్ని బట్టి, భారతదేశం టైర్ II దేశాలలో ఉండదని కేంద్రం పేర్కొంది. ఆరోగ్య సంస్థకు ఈ విషయాన్ని తెలియజేసింది. భారత్ లేవనెత్తిన వాదనపై WHO స్పందించలేదని ప్రభుత్వం తెలిపింది.
Also Read : sex ratio in the country : లద్దాఖ్‌లో ఎక్కువ - మణిపూర్‌లో తక్కువ ! లింగనిష్పత్తి రిపోర్ట్‌లో కీలక అంశాలు