Swami Vivekananda Popular Quotes: భారతదేశ యువత మనసులో స్ఫూర్తి నింపినవారిలో స్వామి వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. యువతకోసం ఆయన ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని, యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన పదే పదే చెప్పేవారు. డబ్బు లేని వాడి కంటే జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు నిజమైన పేదవాడని అనేవారు. యువత ఎప్పుడు గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకాలని, దేనికి భయపడవద్దని చెప్పేవారు. అందుకే ఆయన పుట్టినరోజు జనవరి 12 ను "నేషనల్ యూత్ డే" గా జరుపుకుంటారు. 


స్వామి వివేకానంద ఎల్లప్పుడు తన ప్రసంగాలు, సూక్తులు, పుస్తకాలతో యువతకు దిశానిర్ధేశం చేసేవారు. జీవితంలో నిరాశ, నిస్పృహలు నిండిపోయినప్పుడు, భయ భ్రాంతులకు గురైనపుడు, మనసు చెడు మార్గాల వైపు మరలినప్పుడు వివేకానందకి సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదివితే మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. అలాంటి సూక్తులు మీకోసం..



  • గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి , ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అపుడే విజయం మన సొంతమవుతుంది.

  • ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు.

  • ఎక్కడెక్కడ పోరాటం, తిరుగుబాటు ఉద్భావిస్తాయో అక్కడే జీవముంది, సత్యముంది, చైతన్యముంది. ప్రతీ గొప్ప కార్యం అవహేళన, ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది.

  • ఈ ప్రపంచంలో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు.

  • అసహాయత నుంచి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి. ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేదుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి. మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్తితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి.

  • విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

  • తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.

  • ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

  • జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

  • జీవితం పోరాటాల, భ్రమల పరంపర, జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

  • విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

  • విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం, సార్ధకత.

  • అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ధి, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.

  • సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది.

  • నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

  • మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

  • అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

  • మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

  • ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది.

  • ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికీ సేవకులలా మనం ప్రవర్తించాలి. స్వార్ధాన్ని విడనాడి కృషి చేయాలి.

  • నువ్వు స్వార్ధరహితుడవైతే ఒక్క పారమార్ధిక గ్రంధాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు.

  • పిరికివాడు మాత్రమే 'ఇది నా తలరాత' అని అనుకుంటాడు.