ప్రముఖ ఆర్థిక వేత్త, తత్త్వవేత అయిన అమర్త్య కుమార్ సేన్ చనిపోయారంటూ ఫేక్ వార్తలు వచ్చాయి. ఇందుకు ఓ ప్రముఖ వ్యక్తి ట్వీట్ కారణం అయింది. నోబెల్ బహుమతి గ్రహీత అయిన అమెరికన్ చరిత్రకారిణి క్లౌడియా డేల్ గోల్డిన్ (Claudia Dale Goldin) చేసిన ఓ ట్వీట్ ఈ పుకార్లకు కారణం అయింది. ఆమె అమర్త్యసేన్ చనిపోయారని ట్వీట్ చేశారు. దీంతో ప్రముఖ డిజిటల్ వార్తా సంస్థలు వార్తలు ప్రచురించాయి. కాసేపటికి దీనిపై క్లారిటీ వచ్చింది.

కుమార్తె నందనాసేన్ క్లారిటీ

‘‘ఫ్రెండ్స్, మీ ఆందోళనకు ధన్యవాదాలు కానీ అది ఫేక్ న్యూస్. నాన్న గారు చాలా బావున్నారు. మేం ఫ్యామిలీ అంతా ఈ వారాన్ని కేంబ్రిడ్జ్ లో బాగా గడిపాం. మేం బాయ్ చెప్పేసి వచ్చేటప్పుడు ఆయన హగ్ కూడా ఇచ్చారు. ఇంకా ఆయన హార్వర్డ్‌లో వారానికి రెండు కోర్సులు బోధిస్తున్నారు. ఇంకా ఆయన బిజీగా ఉన్నారు’’ అని అమర్త్యసేన్ కుమార్తె నందనా సేన్ ట్వీట్ చేశారు. తన తండ్రితో ఉన్న ఫోటోని కూడా ట్వీట్ చేశారు.

ఇది తప్పుడు సమాచారం అని అది ఫేక్ ట్వీట్ అయి ఉండవచ్చని ‘ది వైర్’ కి చెందిన న్యూస్ ఎడిటర్ సీమా చిష్టి ట్వీట్ చేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు. మరో వార్తా సంస్థకు చెందిన ఎడిటర్ కమాలికా సేన్ గుప్తా కూడా అమర్త్యసేన్ కుమార్తెతో తాను మాట్లాడానని ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు.