రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ముంబయిలోని ఇంటిపై అనుమానిత వ్యక్తుల నిఘా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న క్రికెట్ బుకీ నరేష్ గౌర్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిమ్ కార్డులు సీక్రెట్‌గా విక్రయాలు చేస్తున్నారన్న అభియోగాల కేసులో నరేష్ గౌర్ రెండో నిందితుడిగా ఉన్నాడు.


ప్రపంచలోనే అత్యంత ధనవంతుడు, భారత్‌లో రిచెస్ట్ మ్యాన్‌గా కొనసాగుతున్న ముకేవ్ అంబానీ లండన్‌కు షిఫ్ట్ అవుతుంటారని సైతం ఇటీవల ప్రచారం జరిగింది. తరచుగా ముంబైలోని ఆయన నివాసం అంటిలియా వద్ద ఏదో ఒక ఘటన జరుగుతుంటుంది. కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఆ ఇంటిపై నిఘా ఉంచారన్న నేపథ్యంలో ముకేష్ అంబానీ ఇంటి వద్ద భద్రతను పెంచారు.


ముకేశ్ అంబానీ ముంబయిలోని ఇంటి వద్ద ఇటీవల ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగారు. ఈ కుబేరుడి ఇంటిపై నిఘా ఉంచారని అనుమానంతో ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ ఇంటి అడ్రస్ తనను అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ట్యాక్సీ డ్రైవర్.. ఓ బ్యాగ్.. ఇద్దరు మనుషులు.. అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్!






బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు..
ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిలియా అడ్రస్ అడిగిన వ్యక్తులు వెంట బ్యాగ్ తెచ్చుకున్నారని నగర పోలీసులకు ట్యాక్సీ డ్రైవర్ సమాచారం అందించాడు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేసిన పోలీసులు.. ముందుగా ట్యాక్సీ డ్రైవర్ స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటిలియా వద్ద భద్రతను పెంచుతూ ముంబై పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిప్టు అయిపోతుందా.. లండన్‌లో ప్యాలెస్ ఎందుకు కొన్నట్టు.. దీనిపై రిలయన్స్‌ రియాక్షన్ ఏంటి?


Also Read: Aryan Khan Case: నేరపూరిత కుట్రకు ఎలాంటి ఆధారాల్లేవు... ఆర్యన్ ఖాన్ బెయిల్‌ ఆర్డర్‌లో బాంబే హైకోర్టు


Also Read: ‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది.. ఈ లిస్ట్‌లో ఉన్నవి వాడితే వెంటనే మార్చాల్సిందే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి