MP Galla Jayadev: ఏపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. రైళ్లలో జర్నలిస్టుల రాయితీపై లోక్ సభలో మాట్లాడారు. కొవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో రూల్ 377 కింద స్పెషల్ మెన్షన్ ద్వారా ఈ విషయంపై ప్రస్తావించారు. జర్నలిస్టులు వృత్తి రీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంటారని ఎంపీ వెల్లడించారు. జర్నలిస్టులకు కొవిడ్-19కు ముందు వరకు రాయితీ ఇచ్చిందని... కానీ కరోనా సమయంలో రాయితీ ఇవ్వడాన్ని నిలిపి వేసిందని గుర్తు చేశారు.


కొవిడ్ - 19 తగ్గిన తర్వాత మిగతా అన్ని రాయితీలను పునరుద్ధరించినప్పటికీ.. జర్నలిస్టు రాయితీలను పునరుద్ధరించ లేదని అన్నారు. రాయితీల ద్వారా రైల్వేకు ఏటా రూ. 50 వేల కోట్ల భారం పడుతోందని తెలుసని చెప్పారు. కానీ జర్నలిస్టులకు రాయితీలు లేకపోవడం వల్ల వారిపై అదనపు భారం పడుతోందని వివరించారు. కరోనాకు ముందులాగా రాయితీలు పునరుద్ధరించాలని ప్రధానిని కోరారు. ఇలా చేస్తే జర్నలిస్టులకు కాస్త భారం తగ్గుతుందని అన్నారు.