కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేశారు ప్రధానమంత్రి మోదీ. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు(Kiren Rijiju )ను తప్పించారు. రిజిజుకు భూవిజ్ఞాన శాస్త్ర బాధ్యతలను అప్పగించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ పదవి నుంచి తప్పించి ఆ శాఖ బాధ్యతలను అర్జున్ రామ్ మేఘ్వాల్ కు అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రివర్గ మార్పునకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కిరణ్ రిజిజును న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
ఈ మార్పుపై కిరణ్ రిజిజు ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాఖను మార్చినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలో జన్మించిన కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.
మంత్రిత్వ శాఖ మారిన తర్వాత కిరణ్ రిజిజు ప్రధాని నరేంద్ర మోడీకి, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ''గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ, హైకోర్టులు, దిగువ కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, మొత్తం న్యాయాధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
'ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలో గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ ను అదే ఉత్సాహంతో నెరవేర్చడానికి నేను ఎదురు చూస్తున్నాను. బీజేపీకి కార్యకర్తగా దీన్ని అంగీకరిస్తున్నాను. అని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
కపిల్ సిబాల్ ట్వీట్
ఈ మార్పుపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ మండిపడ్డారు. 'ఇకపై లా కాదు, ఎర్త్ సైన్సెస్ మంత్రి. చట్టాల వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు మనం సైన్స్ సూత్రాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. గుడ్ లక్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు.
అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు ప్రస్తుతం ఉన్న శాఖకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రగతి మైదాన్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానితో కలిసి అర్జున్ రామ్ మేఘ్ వాల్ భేటీ అయ్యారు.