Meghalaya: ఈశాన్య మేఘాలయ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడి ఫాంహాస్‌లో గుట్టుగా సెక్స్ రాకెట్ నిర్వహించడం కలకలం రేపింది. భాజపా నేత బెర్నార్డ్ మరాక్ ఫాంహౌస్‌పై పోలీసులు రైడ్ చేసి ఈ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు.
ఇదీ జరిగింది
వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలో ఉన్న భాజపా నేత బెర్నార్డ్ మరాక్.. తన ఫాంహౌసులో గుట్టుగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నారు. ఈ మేరకు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం ఆకస్మిక రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో ఆరుగురు చిన్నారులను రక్షించినట్టు వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు.
ఈ వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. రక్షించిన చిన్నారులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు.
ఇంకా
ఫాంహౌసులో 30 చిన్న గదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసుల రైడ్స్‌లో భాగంగా 400 మందు బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
మరాక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరాక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Monkeypox Cases India: దేశంలో మంకీపాక్స్ డేంజర్‌బెల్స్- దిల్లీలో తొలి కేసు నమోదు!
Also Read: Covid Monkeypox: ఆ వ్యక్తికి ఒకేసారి కొవిడ్, మంకీపాక్స్- చరిత్రలో ఇదే తొలిసారి!