Mamata Banerjee Rally In Kolkata: ప్రధాని నరేంద్ర మోదీపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఫైర్ అయ్యారు. వరుసగా విపక్షాల ప్రభుత్వాలను కూల్చడమే మోదీ పనిగా పెట్టుకున్నారని దీదీ ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం కూలక తప్పదని జోస్యం చెప్పారు. కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో దీదీ ఈ మేరకు మాట్లాడారు.
2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం కూలిపోతుంది. ఆ పార్టీకి మెజారిటీ రాదు. కేంద్రంలో అసమర్థ భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. అందుకోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు 'భాజపా తిరస్కరణ ఎన్నికలు' కావాలి.- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
జీఎస్టీపై
భాజపా ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై కూడా దీదీ ధ్వజమెత్తారు.
భాజపాకు బుర్ర పనిచేయడం లేదు. స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాదితే ప్రజలు ఏం తినాలి? అనారోగ్యంతో ప్రజలు ఆసుపత్రిలో చేరినా దానికి కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌ల రేట్లు భారీగా పెంచారు. - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
ప్రభుత్వాలు కూల్చి
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చారు. మీరు ముంబయిని విడగొట్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
Also Read: Bhagwant Mann hospitalized: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం- ఆ గ్లాస్ నీళ్లే కారణమా!
Also Read: Sonia Gandhi's ED appearance: ఈడీ ముందుకు సోనియా గాంధీ- దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన