Maharashtra: సాధారణంగా సిటీల్లో ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తాయి. ఇక డిజిటలైజేషన్, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లేవాళ్లు చాలా తక్కువైపోయారు. అయితే తాజాగా ఓ ఏటీఎం చుట్టూ మాత్రం జనాలు క్యూలైన్లలో బారులు తీరారు. ఎంతగా అంటే అప్పట్లో డిమానిటైజేషన్ అయినప్పుడు జనాలు ఏటీఎంల దగ్గర పడిగాపులు కాసినట్లుగా నిల్చున్నారు. ఇంతకీ అసలు రీజన్ ఏంటంటే?
ఇదీ జరిగింది
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అయితే ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఐదు రెట్లు అధికంగా నగదు వచ్చింది. ఈ విషయం జనాలకు తెలియడంతో ఆ ఏటీఎం వద్ద నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.
500 కొడితే
ఆ ఏటీఎంలో రూ. 500 కావాలని ప్రయత్నిస్తే అందుకు బదులుగా రూ. 2,500 వస్తున్నాయి. ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఐదు రెట్లు డబ్బులు వస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి జనాలు ఆ ఏటీఎంలో పడిగాపులు కాస్తున్నారు. నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.
ఈ విషయం పోలీసులకు చేరడంతో హుటాహుటిన ఆ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. సాంకేతిక సమస్యల కారణంగానే విత్ డ్రా చేసిన నగదు కంటే ఎక్కువగా వస్తుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
Also Read: HIV-AIDS Treatment: పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఫర్లేదు వచ్చినా తగ్గుతుంది- HIVకి ఔషధం వచ్చిందోచ్!
Also Read: Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ రా బుడ్డోడా- వాన పడితే ఇట్టుండాలి మరి!