ఫ్లోర్ టెస్ట్‌కు ముందే సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సేన దీర్ఘకాల మిత్రపక్షమైన బిజెపితో విడిపోయి ఎన్‌సిపి.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 28, 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తన సొంత పార్టీ శ్రేణుల్లోనే తిరుగుబాటును ఎదుర్కొంటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారం రాజీనామా చేశారు, గందరగోళంగా రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసింది. సేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే, ఒక వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఈ పరిణామం జరిగింది. ఇది మహారాష్ట్రలోని ప్రభుత్వ స్థిరత్వాన్నే ప్రశ్నార్థకం చేసింది.
గత వారం, ఫేస్‌బుక్‌లో తన ప్రసంగంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి అలాంటి డిమాండ్ చేస్తే తాను సిఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని థాకరే చెప్పారు. పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు కూడా థాకరే సుముఖత వ్యక్తం చేశారు.
కొన్ని గంటల తర్వాత, ఠాక్రే తన అధికారిక నివాసం 'వర్ష' నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి మాతోశ్రీ కుటుంబ నివాసానికి బయలుదేరారు.
‘‘నా సొంత వాళ్లకే నేను అక్కర్లేదంటే.. అధికారంలో ఉండాలనుకోను. ఒక్క రెబల్ వచ్చి నన్ను ముఖ్యమంత్రిగా వద్దు అని ముఖాముఖి చెప్పినా రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నాను. శివసైనికులు నాకు చెబితే శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను సవాళ్లను ఎదుర్కొంటాను. వాటికి ఎప్పుడూ వెన్నుపోటు పొడవను" అని థాకరే తన 20 నిమిషాల ప్రసంగంలో పేర్కొన్నారు.
MVA కూటమి రూపుదిద్దుకున్న నవంబర్ 2019 నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ, NCP అధ్యక్షుడు శరద్ పవార్ తనను ఉన్నత పదవిని చేపట్టమని సూచించిన తర్వాత రాజకీయ అనుభవం లేనప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించినట్లు థాకరే చెప్పారు.
ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నవంబర్ 28, 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంపై థాకరే నేతృత్వంలోని శివసేన దీర్ఘకాల మిత్రపక్షమైన బీజేపీతో విడిపోయింది. అది MVA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి NCP మరియు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.