Maharastra Political Crisis : ప్రభుత్వం పతనం అంచున ఉన్న సమయంలో నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ప్రాంతాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం క్యాబినెట్ బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చారు. నవీ ముంబై ఎయిర్‌పోర్టుకు డీబీ పాటిల్ పేరు పెట్టారు. ఇందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కేబినెట్ భేటీ సందర్భంగా ఉద్దవ్ ధాకరే కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాలు సహకరించినందుకు ఆయన ప్రజలకు ధ్యాంక్స్ చెప్పారు. దీంతో ఆయన రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్యాక్ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!
దేశం మొత్తం ఇప్పుడు మహారాష్ట్ర వైపు చూస్తోంది. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ వైపే చూస్తున్నారు. బలపరీక్ష జరిగితే ఏమవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కడం కష్టమే. మహారాష్ట్ర అసెంబ్లీ బలం 288 కాగా ఒకరు చనిపోవడం ఇద్దరు జైల్లో ఉండటంతో ఆ బలం 285కి తగ్గింది. అయితే లెక్కప్రకారం అధికార మహావికాస్ అఘాఢీకి 162 మంది బలమంది. ఇద్దరు కోర్టు అనుమతితో ఓటింగ్‌కు వస్తే బలం 164 అవుతుంది. అయితే ఇందులో నుంచే షిండే వర్గం చీలిపోయింది.
'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు
ఇక ఎన్డీయే బలం ప్రస్తుతం 123 ఉన్నప్పటికీ.. షిండే వర్గం కలిస్తే చాలా పెరుగుతుంది. షిండే వర్గంలో ఎంత మంది ప్లేట్ ఫిరాయిస్తారు. ఎంతమంది ఓటు వేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు మెజార్టీ మార్కు మాత్రం 143. ఓటింగ్ జరిగిన సమయంలో అసెంబ్లీకి హాజరైన వారిని బట్టి మెజార్టీ మార్కు మారుతుంది. శివసేన వైపు పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేరని తాజా లెక్కలు చెబుతూనే ఉన్నాయి. ప్రత్యర్థుల బలం 160 దాటిపోయింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు
ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తే బంతి గవర్నర్ కోర్టుకు వెళ్లిపోతుంది. అప్పుడాయన కేంద్రం డైరెక్షన్లోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యర్థి వర్గానికి అవకాశం ఇవ్వడం రాజ్యాంగ నియమం అని చెబుతూ.. ఫడ్నవీస్ ను సీఎంగా ప్రయాణ స్వీకారం చేయించేస్తారు. అంతలోనే ఎన్డీయేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది మళ్లీ సాధారణ ఎన్నికల వరకు ఇబ్బంది ఉండదు. ఏదేమైనా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిలబడటం కష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.