CM Eknath Shinde Speech: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కంటతడి పెట్టారు. సోమవారం మాహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత ప్రసంగించిన శిందే.. భావోద్వేగానికి గురయ్యారు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన సమయంలో తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని ఈ సందర్భంగా శిందే తెలిపారు.
మా కుటంబంపై వాళ్లు దాడి చేశారు. మా నాన్న ఇంకా బతికే ఉన్నారు. అమ్మ చనిపోయింది. నా తల్లిదండ్రులకు నేను సమయం కేటాయించ లేకపోయాను. వాళ్లు నేను ఇంటికి వచ్చాకనే పడుకునే వారు. నేను పడుకున్న తరువాత పనికి వెళ్లేవారు. నా కుమారుడు శ్రీకాంత్‌కు కూడా సరైన సమయం ఇవ్వలేకపోయాను. నేను శివసేన కార్పోరేటర్‌గా ఉన్న సమయంలో నా ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే (శివసేన సీనియర్ నేత) నన్ను ఓదార్చేవారు. ఎవరి కోసం బతకాలని ఆ సమయంలో నాకు అనిపించేది. కానీ డిఘే.. నన్ను ఓదార్చేవారు. కళ్లు తుడుచుకొని, ఇతరుల కన్నీళ్లు నువ్వు తుడవాలని నాతో చెప్పేవారు. - ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
బలపరీక్ష
మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలిచింది. ఏక్‌నాథ్ నేతృత్వంలోని సర్కార్‌కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.
బలపరీక్ష గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే షిండే సర్కార్‌కు 164 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. 99 మంది షిండే సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Also Read: Karnataka: జుట్టు రాలిపోతుందని డిప్రెషన్- యువతి ఆత్మహత్య!