వ్యాక్సినేషన్ వేయించుకుంటే.. సర్టిఫికేట్ మాత్రమే కాదు.. బహుమతులు ఇస్తాం అంటున్నారు ఆ అధికారులు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఉద్యోగం పోతుంది లాంటి ప్రకటనలు కూడా జారీ అయ్యాయి. అయితే మహారాష్ట్రలోని చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ భిన్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. అదేంటి అంటే.. మేయర్ రాఖీ సంజయ్ కంచరల్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. టీకా తీసుకునే వారికి ప్రోత్సాహకాలు అందించాలనుకుంటున్నారు.
నవంబరు 12- 24 మధ్యలో టీకా తీసుకునే వారు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ ఉంది. చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పౌరులు తమ సమీపంలోని ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే బహుమతులు ఎలా అందిస్తారంటే.. టీకా వేయించుకొన్న వారి పేర్లను లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులను ఇస్తారు. లక్కీ డ్రాలో మెుదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతిగా వాషింగ్ మిషన్, మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ ఇవ్వనున్నారు. అంతేకాదు.. మరో 10 మందికి మిక్సర్ గ్రైండర్లను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియాలో ఏడుకోట్లు గెలుచుకున్న అమ్మాయి..
ఆస్ట్రేలియాలో ఓ పాతికేళ్ల అమ్మాయి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వ్యాక్సిన్ వేయించుకుంది. ప్రతిఫలంగా ఏడున్నర కోట్ల రూపాయలు బహుమతిగా దక్కించుకుంది. ఆమె పేరు జోన్నే జూ. ‘ద మిలియన్ డాలర్ వ్యాక్స్ అలియన్స్’... ఇదొక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం. ప్రజలందరూ వ్యాక్సినే వేసుకునేలా ప్రోత్సహించడం కోసం దీన్ని ఆస్ట్రేలియాలోని కొన్ని సంస్థలు, ఎన్జీవోలు కలిపి ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోంచి ఒకరిని లక్కీ డ్రా తీసి ఒక విజేతకు ఒక మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీగా ఇస్తారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని 30 లక్షల మంది పౌరులు తమ పేరును నమోదు చేయించుకున్నారు. పేర్ల నమోదుకు కూడా ముందుగా ఓ ప్రక్రియ నడిచింది. ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నుంచి వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనే కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్టు చేసి వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సమాధానమివ్వాలి. అలా జోన్నేకు కూడా కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారానే తన పేరును వ్యాక్సినేషన్ లాటరీ డ్రాలో నమోదు చేయించుకుంది.
రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు 30 లక్షల మంది లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసిన సంస్థల ప్రతినిధులు డ్రా తీసి విజేతను ప్రకటించారు. తనే విజేత అవుతుందని జూనో ఊహించలేదు. తన పేరు చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతులేసింది. ఒక్కరాత్రిలోనే తన జీవితమే మారిపోయిందని చెబుతోంది జూనో.
Also Read: Food Label: ఫుడ్ ప్యాకింగ్ లేబుళ్లపై ఇలా రాసి ఉంటే కొనే ముందు ఆలోచించండి, ఎందుకంటే...
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..