Love Jihad in UP:
ప్రత్యేక నిఘా..
యూపీలో లవ్ జిహాదీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యోగి సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. వీటిని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ 427 లవ్ జిహాదీ కేసులు నమోదయ్యాయి. బలవంతంగా మతం మార్చిన కేసుల్లో దాదాపు 833 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 185 కేసుల్లో బాధితులు తమను బలవంతంగా మతం మార్పించారని అంగీకరించారు. కోర్టులోనూ ఇదే విషయం వెల్లడించారు. అయితే...మైనర్లనూ ఇలానే ట్రాప్ చేసి మతం మార్చుతున్న కేసులు దాదాపు 65 వరకూ నమోదయ్యాయి. బరేలీలో ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే...దివ్యాంగులను ఎక్కువగా టార్గెట్ చేసుకుని మత మార్పిడికి పాల్పడుతున్నట్టు తేలింది. ఈ కారణంగానే యోగి సర్కార్ నిఘా పెట్టింది. 2020 నుంచే దీన్ని కట్టడి చేస్తూ వస్తోంది. అదే ఏడాది నవంబర్‌లో Prohibition of Illegal Religious Conversion Act ని అమల్లోకి తీసుకొచ్చింది.
కఠిన శిక్షలు..
ఈ చట్టంలో భాగంగా ఆంక్షల్ని కఠినతరం చేసింది. నిందితులకు శిక్షల్ని తీవ్రంగా పెంచింది. మతం మార్చాలంటేనే భయపడేలా చేయాలని చూస్తోంది. కన్వర్షన్ యాక్ట్ కింద దోషిగా తేలిన వాళ్లకు గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తోంది. నేర తీవ్రతను బట్టి జైలుశిక్షను నిర్ణయిస్తోంది. ఇదే సమయంలో జరిమానానూ విధిస్తోంది. రూ.15-50 వేల వరకూ ఫైన్ వేస్తోంది. మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే జంటలు తప్పనిసరిగా రెండు నెలల ముందే జిల్లా మెజిస్ట్రేట్‌కి సమాచారం అందించాలన్న నిబంధన పెట్టింది యోగి సర్కార్. ఇలా సమాచారం ఇవ్వకుండా బలవంతంగా పెళ్లి చేసుకుంటే 1-5 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఇక SC, ST వర్గాలకు చెందిన వాళ్లతో పాటు మైనర్లను బలవంతంగా మతం మార్చిన వాళ్లకు 3-10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో ఇలా...
లవ్ జీహాద్‌పై పదేపదే బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కొందరు ముస్లిం యువకులు హిందూ యువతులను టార్గెట్ చేసి ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, చంపుతున్నారంటూ చాన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర మంత్రి అసెంబ్లీలోనే లవ్ జీహాద్‌పై వ్యాఖ్యలు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా రాష్ట్రంలో ఇప్పటి వరకూ లక్షకుపైగా లవ్ జీహాద్ కేసులు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. చాలా జిల్లాల్లో ఈ కేసులకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఆందోళనలు చేపట్టారని చెప్పారు. శ్రద్ధ వాకర్ తరహాలో మరే యువతి కూడా హత్యకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఇలాంటి హత్యలను అరికట్టేందుకే Inter-Faith Marriage Committee ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు మంగళ్ ప్రభాత్. గతేడాది డిసెంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారి వివరాలన్నీ సేకరించడమే ఈ కమిటీ పని. ఎన్ని పెళ్లిళ్లు జరిగాయి..? ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు..? వాళ్ల మతాలేంటి..? అనే సమాచారమంతా సేకరించి దాని ఆధారంగా నిఘా పెడతారు.
Also Read: J&K Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు