Rahul Gandhi: 


అమేఠీ నుంచి పోటీ..


రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేఠి నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్ వెల్లడించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అమేఠి నుంచి పోటీ చేస్తారని తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీది ఇదే నియోజకవర్గం. ఇక్కడే పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అజయ్ రాయ్ అన్నారు. 


"రాహుల్ గాంధీ అమేఠి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఇక్కడి ప్రజలూ అదే కోరుకుంటున్నారు. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేయాలని భావిస్తే ఆమె విజయం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడి బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ప్రజలకు ఏం చేశారు? చక్కెర కిలో ధరను రూ.13 మేర తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఇది చేశారా...? ఇక నుంచి ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసేలా కృషి చేస్తాం"


- అజయ్ రాయ్, యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 






కాంగ్రెస్‌కి కంచుకోట


కాంగ్రెస్‌కి కంచుకోట అయిన అమేఠీలో రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రత్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించారు. అప్పటికే మునిగిపోతున్న కాంగ్రెస్‌కి ఇలాంటి కంచుకోటలోనూ ఓడిపోవడం చాలా ఇబ్బంది పెట్టింది. పైగా 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2019లో రాహుల్ ఓడిపోయేంత వరకూ కాంగ్రెస్ ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చింది. తొలిసారి ఇక్కడ 1967లో ఎన్నికలు జరిగాయి. గాంధీలకు ఇది అచ్చొచ్చిన నియోజకవర్గం. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడే గెలిచారు. ఆ తరవాత సోనియా గాంధీ కూడా ఇక్కడే విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకూ రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. అందుకే...ఇక్కడ గెలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది కాంగ్రెస్


రాహుల్ గాంధీ  లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో  ఎంపీగా కేటాయించిన ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు పాత ఇల్లునే మళ్లీ కేటాయించారు.  గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించుకుంది. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగడంతో రాహుల్ గాంధీ  కి ఢిల్లీలో అధికారిక బంగళాను ప్రభుత్వం తిరిగి కేటాయించింది. గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించుకుంది. పరువునష్టం కేసులో పార్లమెంటు సభ్యత్వాన్ని రాహుల్ ఇటీవల కోల్పోవడంతో నిబంధనల ప్రకారం గత ఏప్రిల్ 22న రాహుల్ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఆ వెంటనే తన తల్లి సోనియాగాంధీ 10 జనపథ్ రెసిడెన్స్‌లో ఆమెతో పాటే ఉంటున్నారు. రాహుల్‌కు తమ ఇంట్లో నివాసం కల్పించేందుకు పలువురు పార్టీ నేతలు మందుకు వచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన 'స్టే'తో రాహుల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. 


Also Read: దేశంలోని తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం, 45 రోజుల్లోనే పూర్తి చేసిన రోబోలు