3D Printed Post Office: 



తొలి 3D పోస్ట్ ఆఫీస్ ప్రారంభం..


కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని Cambridge Layout వద్ద 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పోస్ట్‌ ఆఫీస్‌ని నిర్మించారు. పోస్టల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఆఫీస్‌ని  Larsen & Toubro Limited కంపెనీ నిర్మించింది. ఐఐటీ మద్రాస్ టెక్నికల్ గైడెన్స్ ఇచ్చింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన అశ్వినీ వైష్ణవ్...గతంలో అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేయగలుగుతున్నామని వెల్లడించారు. 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ ఆఫీస్‌ని నిర్మించినట్టు వివరించారు. 


"గతంలో అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సుసాధ్యం అవుతున్నాయి. ఇదంతా టెక్నాలజీ మహిమ. అభివృద్ధి చేయాలనే స్ఫూర్తి మనలో ఉంటే...సొంత టెక్నాలజీతో అద్భుతాలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ. రోబోటిక్ ప్రింటర్ డిజైన్ ఆధారంగా లేయర్‌ల వారీగా కాంక్రీట్‌ని పోస్తుంది. దీనికోసం స్పెషల్ గ్రేడ్ కాంక్రీట్‌ని వినియోగించారు. తక్కువ సమయంలోనే గోడలు గట్టి పడడానికి దీన్ని వాడారు. సాధారణ నిర్మాణాలకు 6-8 నెలల సమయం పడుతుంది. కానీ...ఈ టెక్నాలజీతో 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తైంది"


- అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి 






సంప్రదాయ నిర్మాణాలకు విభిన్నం..


సంప్రదాయ నిర్మాణాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ 3D Printed నిర్మాణాలు. ముందుగా నిర్దేశించిన డిజైన్ ప్రకారం అంతా రోబోలే పూర్తి చేస్తాయి. టైమ్‌తో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. బెంగళూరులోని పోస్ట్ ఆఫీస్ నిర్మాణం...ఐఐటీ మద్రాస్ టెక్నికల్ సపోర్ట్‌తో పూర్తైంది. 


"త్రీడీ ప్రింటెడ్ కాంక్రీట్ బిల్డింగ్‌లు నిర్మించాలన్న ఆలోచనే గొప్పది. టెక్నాలజీతో ఇది మరో ముందడుగు. ఐఐటీ మద్రాస్ అద్భుతంగా పని చేసింది. టెక్నాలజీని సరైన విధంగా వినియోగించుకుంటే మున్ముందు మరెన్నో నిర్మాణాలు చేయొచ్చు"


-  అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి 






Also Read: కోటాలోని హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్స్‌కి స్ప్రింగ్‌లు, ఆత్మహత్యలను అడ్డుకునేందుకు కొత్త ప్లాన్