ABP  WhatsApp

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

ABP Desam Updated at: 27 May 2022 05:20 PM (IST)
Edited By: Murali Krishna

Ladakh Road Accident: లద్దాఖ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

NEXT PREV











Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. తుర్తుక్ సెక్టార్‌లో ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు షయొక్ నదిలో పడినట్లు సైన్యం తెలిపింది. ప్రమాద సమయంలో వాహనంలో 26 మంది ఉన్నట్లు సమాచారం.

 


ప‌ర్తాపూర్ క్యాంప్ నుంచి 26 మంది జ‌వాన్లు వాహ‌నంలో బ‌య‌ల్దేరారు. షయొక్ న‌ది ద‌గ్గ‌ర వాహ‌నం స్కిడ్ అయి న‌దిలో ప‌డిపోయింది. ఏడుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగ‌తా జ‌వాన్లు గాయాల పాల‌య్యారు.                                                                   -   భారత సైన్యం

 

ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను ఆర్మీ ఫీల్డ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని ఆర్మీ పేర్కొంది. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు ఆర్మీ పేర్కొంది. తీవ్రంగా గాయ‌ప‌డి, ఇబ్బందులున్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో వెస్ట్ర‌న్ క‌మాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని ఆర్మీ పేర్కొంది.












క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీపేర్కొంది. తీవ్రంగా గాయపడిన వారిని వాయుసేన సాయంతో వెస్ట్రన్ కమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించింది.

 


 


 

 

















Published at: 27 May 2022 04:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.