ABP  WhatsApp

Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

ABP Desam Updated at: 27 May 2022 05:01 PM (IST)
Edited By: Murali Krishna

Drone Mahotsav 2022: డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకొచ్చిందన్నారు.

దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

NEXT PREV

Drone Mahotsav 2022: దిల్లీలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ మహోత్సవ్​ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. భారత్‌లో డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు సాంకేతికత వినియోగం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందని మోదీ అన్నారు.








8 ఏళ్ల క్రితం మేం పరిపాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాం. కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన- సులభతర జీవన విధానం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే పరిపాలనలో సాంకేతికత కూడా చాలా ముఖ్యం. దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు చేరవేసేందుకు ఇది సాయం చేస్తుంది. నేను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు డ్రోన్ల ద్వారా అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకుంటున్నా. దేశంలో తొలిసారి ప్రతి గ్రామంలోని ఆస్తులను డిజిటల్​గా మ్యాప్ చేస్తున్నాం. డిజిటల్ ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, క్రీడ, విపత్తు నిర్వహణ రంగాల్లో డ్రోన్ల ఉపయోగం చాలా పెరుగుతుంది.  - ప్రధాని నరేంద్ర మోదీ


దిల్లీలో మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్​ డ్రోన్ మహోత్సవ్-2022 జరుగుతోంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో పాటు పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు డ్రోన్ల అంకుర సంస్థలు పాల్గొననునన్నాయి.


Also Read: Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి


Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు

Published at: 27 May 2022 04:58 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.