UNESCO:
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేరళలోని కోజికోడ్ (Kozhikode) నగరానికి "City of Literature"గా యునెస్కో గుర్తింపునిచ్చినట్టు వెల్లడించారు. భారత్‌కి ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో గ్వాలియర్‌ని ‘City of Music’గా గుర్తించినట్టు ప్రకటించారు. యునెస్కోకి (UNESCO) చెందిన క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో ఈ రెండు సిటీలకూ చోటు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. సంస్కృతిని కాపాడుకోవడంలో ఈ రెండు నగరాలు ఎంతో కృషి చేశాయని, ఆ నిబద్ధతే ఈ గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.
అక్టోబర్ 31న World Cities Day సందర్భంగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ని విడుదల చేసింది యునెస్కో. Creative Cities Network (UCCN)లో 55 నగరాల్ని చేర్చింది. ఈ నగరాల్లో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్‌లో బుఖరా, మీడియా ఆర్ట్స్‌లో కసబ్లంక, డిజైనింగ్‌లో చాంగ్‌క్వింగ్ సిటీస్‌ను జాబితాలో చేర్చింది. ఈ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 100 దేశాలకు చెందిన 350 నగరాలున్నాయి. క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రనామి, లిటరేచర్, మీడియా ఆర్ట్స్ అండ్ మ్యూజిక్...ఇలా మొత్తం 7 రంగాల్లో నగరాలకు గుర్తింపునిస్తుంది యునెస్కో.