Kolkata Doctor Case: పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజధాని కోల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఓ జూనియర్ డాక్టర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. కోల్ కతాలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఓ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన గత వారం క్రితం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయి. 


బెంగాల్‌లోని ది ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫోర్డా) ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 12) కూడా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపేశారు. ఉదయం 9 గంటల నుంచి నిరవధిక దీక్షను ప్రారంభించగా.. ఢిల్లీలోని కేంద్రం ఆధీనంలోని ఎయిమ్స్ ​తోపాటుగా ఆర్ఎంఎల్, సఫ్దర్ ​గంజ్​ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 


మమతా బెనర్జీ స్పందన ఇదే.. గట్టి ఆదేశాలు
జూనియర్​ డాక్టర్ పై జరిగిన ఈ అమానుష కేసును 7 రోజుల్లోగా పరిష్కరించాలని పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆదేశించారు. హత్య కేసును వచ్చే ఆదివారంలోగా  పరిష్కరించాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే కేసును సీబీఐకి అప్పగిస్తానని అప్పుడే చెప్పారు. సోమవారం ఆమె బాధితుల ఇంటికి వెళ్లి, ఆమె ఫ్యామిలీని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్​ చేశారని, ఇంకా నిందితులను ఆదివారంలోగా అరెస్ట్​ చేస్తామని చెప్పారు.