కేరళ పూవంగోడ్‌లో శనివారం ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ గ్రౌండ్‌లో ప్రమాదం జరిగింది. మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంపరరీ గ్యాలరీ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 200 మందికి గాయాలయ్యాయి. ఇందుంలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
మలప్పురం జిల్లాలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వీరి కోసం ఎల్‌పీ స్కూల్ గ్రౌండ్‌లో భారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే మ్యాచ్ జరుగుతోన్న సమయంలో అందులో ఓ టెంపరరీ గ్యాలరీ కూలిపోయింది.
గాయపడిన వారిని మంజేరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయాలైన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
ఎలా జరిగింది?
మ్యాచ్ చూసేందుకు అనుకున్నదాని కన్నా ఎక్కువ మంది జనం వచ్చారు. దీంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ చూసేందుకు దాదాపు 8 వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది. ఈస్ట్ స్టాండ్‌లో 3 వేల మంది కూర్చున్నారు. మ్యాచ్ జరగబోయే కొద్ది క్షణాల ముందే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాచ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మలప్పురం ఎస్పీ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!
Also Read: Volodymyr Zelenskyy: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి