Kochi Blast:
ఆల్‌పార్టీ మీటింగ్..
పేలుళ్ల ఘటనతో ఒక్కసారిగా కేరళ ప్రభుత్వం (kerala blast news) అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఉగ్రదాడుల అనుమానాల నేపథ్యంలో NSG టీమ్ ఘటనా స్థలానికి చేరుకోనుంది. NIA దర్యాప్తునకూ ఆదేశించింది. ఈ క్రమంలోనే సీఎం పినరయి విజయన్ ఆల్ పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ ఘటన (Kochi Blast News) జరిగిన వెంటనే కేరళకు బయల్దేరారు. సోమవారం (అక్టోబర్ 30) ఉదయం 10 గంటలకు సమావేశమవ్వాలని నిర్ణయించారు. సెక్రటేరియట్‌లోని సీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో భేటీకి పిలుపునిచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 9.47 నిముషాలకు మొదటి పేలుడు సంభవించింది. టిఫిన్ బాక్స్‌లో IED పెట్టి పేల్చినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే..? ఈ పేలుళ్లలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం 40 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రత పరంగా చూస్తే తక్కువగానే అనిపించినప్పటికీ...వరుసగా ఒకే చోట మూడు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. ఎర్నాకులంలోని కలమస్సెరీ కన్వెన్షన్ హాల్‌లో ఈ పేలుళ్లు (Kalamassery Blast) సంభవించాయి. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను తలుచుకుని ఆందోళనకు లోనవుతున్నారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించిందని, అంతలోనే మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. పేలుడు ధాటికి హాల్ అంతా పొగ కమ్ముకుందని వివరించారు.
"సరిగ్గా హాల్ మధ్యలోనే పేలుడు సంభవించింది. మూడు సార్లు గట్టిగా శబ్దాలు వినిపించాయి. నేను వెనకాల ఉన్నాను కాబట్టి నాకేమీ కాలేదు. కానీ విపరీతంగా పొగ కమ్ముకుంది. ఓ మహిళ చనిపోయిందని అందరూ అనుకుంటుంటే విన్నాను. ఈ హాల్‌కి మొత్తం 6 ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లున్నాయి. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే అందరూ ఎవరి దారిలో వాళ్లు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. మంటలు పూర్తిగా వ్యాపించకపోవడం వల్ల ప్రమాదం తప్పింది"
- ప్రత్యక్ష సాక్షి