RSS Founder Biography: 


కర్ణాటకలో నిర్ణయం..? 


కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. స్కూల్ సిలబస్ నుంచి RSS ఫౌండర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ ( Keshav Baliram Hedgewar) పాఠాన్ని తొలగించాలని భావిస్తోంది. బీజేపీ ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన మెటీరియల్స్‌నీ మార్చేయాలని చూస్తోంది. అంటే...మొత్తంగా సిలబస్‌ మార్చేందుకే ప్లాన్ చేస్తోందన్నమాట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. RSS ఫౌండర్ కేశవ్ బలిరామ్‌ పాఠాన్ని తొలగించడంతో పాటు చక్రవర్తి సులిబెలె, బన్నాజే గోవిందాచార్య పాఠాలనూ తీసేయాలని చూస్తోంది. అయితే..ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అయిపోయాయి. అందుకే...ఆ పాఠాలను పిల్లలకు చెప్పకుండా స్కిప్ చేయాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేయనుంది ప్రభుత్వం. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. బ్రిటీషర్ల ముందు లొంగిపోయి క్షమాపణలు చెప్పిన అలాంటి వ్యక్తుల పాఠాలు పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులు అలాంటి వాళ్ల గురించి తెలుసుకోకపోవడమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. నిజమైన దేశ భక్తుల పాఠాలనే విద్యార్థులు నేర్చుకునేలా చేయడం తమ బాధ్యత అని కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీ కావాలనే తమ సిద్ధాంతాలను పిల్లలపై రుద్దే కుట్ర చేసిందని ఆరోపించింది. ఇది ముమ్మాటికీ తప్పేనని, అందుకే సిలబస్‌లో బలిరామ్ పాఠాన్ని తొలగిస్తామని కొందరు నేతలు చెబుతున్నారు. కర్ణాటక విద్యామంత్రి మధు బంగరప్ప దీనిపై స్పందించారు. 


"పిల్లల మనసులను కల్మషంతో నింపే కుట్ర బీజేపీ చేసింది. అలాంటి విద్యను వాళ్లకు అందించాలని చూసింది. మేం మాత్రం అలా కాదు. అయినా...బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఆలోచన చేయడం లేదు. ఇదంతా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదే. మా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా మాకు వివరించారు"


- మధు బంగరప్ప, కర్ణాటక విద్యామంత్రి 


మహమ్మద్ ఇక్బాల్‌ పాఠం తొలగింపు..


ఇటీవలే NCERT సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై భిన్న వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విమర్శలూ ఎదురయ్యాయి. ఇదే క్రమంలో అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ (Academic Council of Delhi University) సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన రచయిత మహమ్మద్ ఇక్బాల్‌పై (Muhammad Allama Iqbal) ఉన్న లెసన్‌ని సిలబస్‌లో నుంచి తీసేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ సర్య్కులర్ కూడా జారీ చేసింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో నుంచి ఈ పాఠాన్ని తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. 1877లో సియాల్‌కోట్‌లో జన్మించారు మహమ్మద్ ఇక్బాల్. "సారే జహాసే అచ్ఛా" గీతాన్ని రచించింది ఈయనే. పాకిస్థాన్‌కి ఆద్యుడిగానూ ఆయనను పిలుచుకుంటారు. బీఏ ఆరో సెమిస్టర్‌ పేపర్‌లో  Modern Indian Political Thought పేరుతో ఉన్న ఛాప్టర్‌లో ఇక్బాల్‌ గురించి ప్రస్తావన ఉంది. అయితే...ఈ లెసన్‌ ప్రస్తుతానికి అవసరం లేదని అకాడమిక్ కౌన్సిల్ భావిస్తోంది. తొలగిస్తున్నట్టు ప్రకటిస్తూనే...ఈ ప్రతిపాదనను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ ముందుంచింది. ఈ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆ పాఠం ఉంటుందా లేదా అన్న క్లారిటీ వచ్చేస్తుంది.


Also Read: International Yoga Day: యోగా రాజకీయాలు షురూ, బీజేపీకి పోటీగా ఆప్ వేడుకలు