Jammu Kashmir Earthquake:
లద్దాఖ్‌లో భూకంపం..
జమ్ముకశ్మీర్‌లో భూకంపం కలకలం రేపింది. ఇవాళ (జులై 4) ఉదయం 7.38 నిముషాలకు ఉన్నట్టుండి భూమి కంపించింది. లద్దాఖ్‌లో ఈ ప్రభావం కనిపించింది. కార్గిల్‌కి 401 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతు వరకూ భూమి కంపించినట్టు భూకంప కేంద్ర వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7గా తీవ్రత నమోదైంది. అయితే...ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లలేదని భూకంప కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జూన్ 18వ తేదీన లేహ్ లద్దాఖ్ ప్రాంతంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైంది. అదే రోజున జమ్ముకశ్మీర్‌లోని దొడ జిల్లాలో రెండు సార్లు భూమి కంపించింది. అప్పుడు కూడా ఉదయమే ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఘటనలో కొన్ని భవనాలకు పగుళ్లు వచ్చాయి. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు.