2047 నాటికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దానిపైనే ఫోకస్ చేయాలని మంత్రివర్గ సహచరులకు ప్రధాని సూచించారు.  2024 నుంచి దృష్టిని మరల్చాలని 2047 నాటికి వృద్ధి సాధించాల్సిన రంగాలపై ఫోకస్‌ పెంచాలని అన్నారు. భారతదేశ వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన మంత్రి మండలిని కోరారు. ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.


2047 వరకు ఉన్న కాలాన్ని దేశానికి "అమృత్ కాల్"గా పిఎం మోడీ అభివర్ణించారు. రాబోయే 25 సంవత్సరాలలో 2047 నాటికి చాలా మార్పులు వస్తాయని, భారతదేశం ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తితో  నిండి ఉంటుందని అన్నారు. వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడొచ్చన్నారు. ఈ సమావేశంలో విదేశీ, రక్షణ, రైల్వే సహా వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు కార్యదర్శులు మాట్లాడారు. రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం సాధించాల్సిన అభివృద్ధిపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి.






సమావేశం తరువాత ఈ సమావేశ ఫొటోలాను మోదీ తన ట్విటర్‌లో షేర్ చేశారు. మంత్రి మండలితో ఫలవంతమైన సమావేశం జరిగిందని, తాము విభిన్న అంశాలు, సమస్యలపై చర్చించామని చెప్పుకొచ్చారు. 


ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, ఆ పనుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.  వచ్చే తొమ్మిది నెలల్లో అంతా జనంలోనే ఉండాలని ఆదేశించారు. తొమ్మిదేళ్ల అభివృద్ధిని తొమ్మిది నిమిషాల వీడియో ద్వారా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలన్నారు. మంత్రులు సాధించిన ప్రధాన విజయాలు, పథకాలతో క్యాలెండర్ తయారు చేయాలన్నారు. ఆ విజయంలో భాగస్వాములైన వారిని ప్రోత్సహించాలని సూచించారు. 


అధికార బీజేపీ అగ్రనేతల వరుస సమావేశాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వచ్చాయి. మార్కులు తథ్యమన్న టైంలో ఈ సమావేశం జరిగింది. జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


Also Read: కేదార్‌నాథ్ ఆలయంలో లవ్ ప్రపోజల్, యువతిపై భక్తుల ఆగ్రహం - వైరల్ వీడియో


Also Read: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఏపీలో మరో వందేభారత్ ఈ నెల 7 నుంచి పరుగులు


                                       Join Us on Telegram: https://t.me/abpdesamofficial