ISRO Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3.. మరో కీలక దశకు దగ్గరైంది. చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించి అనంతరం కక్ష్యలోకి చేరనుంది. ఆగస్టు 1వ తేదీ ఉదయం 12 నుంచి ఒంటి గంట మధ్య ప్రణాళిక సిద్ధం చేశారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్(TLI) కోసం 28 నిమిషాల నుంచి 31 నిమిషాల వరకు సమయం పట్టనుంది. భూమికి అత్యంత సమీప బిందువు వద్ద ఉన్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ థ్రస్టర్లను మండించి ముందుకు తీసుకెళ్లనున్నారు. చంద్రయాన్-3 ప్రస్తుతం 1 కిమీ/సెకన్, 10.3కిమీ/సెకన్ మధ్య వేగంతో దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ కదులుతోంది. చంద్రయాన్-3 వేగం భూమికి అత్యంత సమీప బిందువు వద్ద అత్యధికంగా (10.3 కిమీ/సె), భూమికి అత్యంత దూరంలో ఉన్న ప్రదేశంలో అత్యల్పంగా ఉంటుంది. చంద్రయాన్-3 భూమికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడే థ్రస్టర్లను మండించి అత్యధిక వేగంలో ఉన్నప్పుడే చంద్రయాన్-౩ కోణాన్ని మారుస్తారు. ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ కోసం ఐదారు గంటల ముందే ఆదేశాలు ఇవ్వనున్నారు. కచ్చితమైన సమయాన్ని నిర్దేశించి థ్రస్టర్లను మండేలా చేయనున్నారు. చంద్రయాన్-౩.. 1.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 51 గంటలు పడుతుంది. భూమికి చంద్రునికి మధ్య సగటు దూరం 3.8 లక్షల కిలోమీటర్లు. 


చంద్రుని కక్ష్యను చేరుకోవడం మిషన్ లో ఒక భాగం మాత్రమే. చంద్రయాన్ లను గతంలోనూ ఇస్రో చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టగలిగింది 2008(చంద్రయాన్-1), 2019(చంద్రయాన్-2) లోనూ చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అసలు సిసలు సవాలు ఎదురయ్యేది మాత్రం చంద్రుని చివరి కక్ష్యలో ఉంటూ.. సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. ఆగస్టు 23వ తేదీ తర్వాత ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. 


Also Read: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే యువతి రిజైన్- తప్పో ఒప్పో చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్


ఆదివారం విజయవంతమైన సీ56 ప్రయోగం


పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. తిరుపతి జిల్లా సూళ్లూరు పేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం (జూలై 30) ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ56 ప్రయోగాన్ని నిర్వహించారు. కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా 6.31 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు ఉన్న ఏడు శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. 1999 నుంచి 36 దేశాలకు చెందిన 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో రికార్డు సృష్టించింది. 


2023లో ఏడాది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇస్రో ఇప్పటికే రెండు వాణిజ్య ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించింది. మొదటిది మార్చిలో LVM3 రాకెట్‌తో UK ఆధారిత వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఏప్రిల్‌లో రెండో ప్రయోగం చేసింది. PSLV రాకెట్‌తో సింగపూర్ TeLEOS-2, Lumilite-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  మూడో ప్రయోగం ఆదివారం జరిగే మూడో ప్రయోగంలో  PSLV-C56 కోడ్‌తో కూడిన PSLV రాకెట్ సింగపూర్‌కు చెందిన 360 కిలోల బరువున్న DS-SAR ఉపగ్రహాన్ని తీసుకెళ్లనుంది. దానితో పాటు మరో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఇందులో నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-AM, ARCADE, SCOOB-II, NuSpace Pte Ltdకి చెందిన NuLION, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌‌కు చెందిన Galassia-2,  Aliena Pte సంస్థకు చెందిన ORB-12 STRIDER ఉపగ్రహాలు ఉన్నాయి.