మహిళా సాధికారత గురించి, వారి అభ్యున్నతి గురించి.. 'మహిళా దినోత్సవం' రోజే ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. కానీ చట్టసభల్లో, ఉద్యోగాల్లో, కీలక పదవుల్లో ఎక్కువగా వారికి అవకాశం ఇచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారత. దేశంలోనే అక్షరాస్యతలో ముందుండే కేరళ ఇటీవల మరో ఘనత సాధించింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పినరయి విజయన్ సర్కార్ తన మార్క్ పాలనను మరోసారి చాటిచెప్పింది.


కేరళ ప్రభుత్వం తొలిసారి మెజారిటీ జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా అధికారులను నియమించింది. మొత్తం 14 జిల్లాలకు గానూ 10 జిల్లాలకు మహిళలనే పాలనాధికారులుగా ఎంపిక చేసింది. గతేడాది కాసర్​గోడ్ జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మహిళా ఐఏఎస్ అధికారి కలెక్టర్​ పగ్గాలు చేపట్టారు. 


రికార్డ్


అలప్పుజ జిల్లా కలెక్టర్​గా డా. రేణురాజ్​ను ఇటీవల నియమించడం వల్ల​ రాష్ట్ర పాలన యంత్రాంగంలో కొత్త చరిత్ర సృష్టించింది కేరళ ప్రభుత్వం. రేణురాజ్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మహిళా జిల్లా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది. 


రేణురాజ్​ కంటే ముందే కేరళలో 9 జిల్లాల్లో మహిళా పాలనాధికారులున్నారు. రాష్ట్ర పరిపాలన చరిత్రలోనే ఇది రికార్డు. 


కేరళ ప్రభుత్వం కూడా వారి ప్రతిభను గుర్తించింది. రెవెన్యూ డే సెలబ్రేషన్స్​ సందర్భంగా అందించిన మూడు ఉత్తమ జిల్లా కలెక్టర్ల అవార్డులు మహిళా పాలనాధికారులకే దక్కాయి. కొవిడ్ సంక్షోభం వేళ, వరదలు వచ్చిన సమయంలో మహిళా పాలనాధికారులు పనిచేసిన విధానం అమోఘం. ముఖ్యంగా వరదల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లి వారు పరిస్థితులను అంచనా వేసి.. తగిన చర్యలు చేపట్టారు ఈ మహిళామణులు.


వీరే




  1. డా. రేణూరాజ్ (అలప్పుజ)

  2. నవ్‌జోత్ ఖోసా (తిరువనంతపురం)

  3. మృన్మయి జోషి (పాలక్కాడ్)

  4. హరిత వీ కుమార్ (త్రిస్సూర్)

  5. దివ్య ఎస్ అయ్యర్ (పతనంతిట్ట)

  6. అఫ్సానా ప్రవీణ్ (కొల్లాం)

  7. షీబా జార్జ్ (ఇడుక్కి)

  8. డా. పీకే జయశ్రీ (కొట్టాయం)

  9. భండారీ స్వాగత్ రణ్‌వీర్ చంద్ (కాసర్‌గోడ్)

  10. డా. ఏ గీత (వయనాడ్)




Also Read: International Womens Day: రెస్పెక్టెడ్‌ విమెన్‌! ఈక్విటీతోనే ఈక్వాలిటీ - 'ఫండ్లు' కొనండి, డబ్బు పొందండి!


Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్‌ ఫేమస్‌, హైదరాబాద్‌ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ