Corona Cases:
దేశంలో రోజువారి కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 2,827 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 మంది మృతి చెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19,067గా ఉంది.
ఇప్పటివరకు కోరనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,70,165కు చేరింది. ఇప్పటివరకు 5,24,181 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 3230 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.74గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,13,437
- మొత్తం మరణాలు: 5,24,181
- యాక్టివ్ కేసులు: 19,067
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,70,165
వ్యాక్సినేషన్
బుధవారం 14,85,292 మందికి కరోనా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,83,96,788కి చేరింది. ఒక్కరోజే 4,71,276 కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల వేళ ప్రజలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే ఆరోగ్యకార్యకర్తలు సహా ఫ్రంట్ లైన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరికీ బూస్టర్ డోసు ఇచ్చే యోచనలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉంది.
Bengal Mamata : దీదీ కవితలకు అవార్డివ్వడం అవమానం - బెంగాల్‌లో సాహిత్య రాజకీయాలు !