దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారిని దాదాపు కట్టడి చేయగా, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,929 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 392 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. జనవరిలో వ్యాక్సినేషన్ పంపిణీ మొదలైనప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,07,92,19,546 (107 కోట్ల 92 లక్షల 19 వేల 546) డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది.


భారత్‌లో ప్రస్తుతం 1,46,950 (ఒక లక్షా 46 వేల 950) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,10,783 (8 లక్షల 10 వేల 783) శాంపిల్స్ పరీక్షించగా.. ఓవరాల్ గా 61,39,65,751 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ టెస్టులు చేసినట్లు తాజా హెల్త్ బులెటిన్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు.


Also Read: పొడవైన తోకతో పుట్టిన శిశువు.. చివరిలో బంతిలాంటి భాగం






దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,44,683 కు చేరుకోగా.. ఇప్పటివరకూ 4,60,265 మంది కొవిడ్ బారిన పడి చనిపోయారరు. మరోవైపు రికవరీ రేటు మెరుగవటం భారీ ఊరటనిస్తోంది. కరోనా రికవరీ రేటు  98.23 శాతానికి చేరుకుందని తాజాగా తెలిపారు. దేశంలో 0.43 శాతం యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడితే దేశంలో కరోనా ప్రభావం దాదాపు తగ్గినట్లే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు సాధారణంగా నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తూ బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు, మెడికల్ సిబ్బందిని ముఖ్యమంత్రులు ఆదేశించారు.
Also Read: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ


ఏపీలో కొత్తగా 150 కరోనా కేసులు, మూడు మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 150 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,391కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,555 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3,760 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: ‘నిధివన్’ మిస్టరీ.. ఈ ఆలయంలో రాత్రి మంచాన్ని అలంకరిస్తారు.. ఉదయానికి అంతా చెల్లాచెదురు.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి