తిహాసాలతో ముడిపడిన దేశం మనది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం. ఇందులోని నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునిగితేలేవాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. అదే నిధివన్. ఉదయం వేళలో భక్తులు నిధివన్‌ను సందర్శించవచ్చు. కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే రాత్రివేళల్లో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడుతాడట. వినేందుకు ఇది చిత్రంగానే ఉన్నా.. స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు. 


నిధివన్ గురించి చెప్పమని స్థానికులను అడిగితే.. ఈ విషయాన్నే ముందుగా చెబుతారు. పగటి వేళలలో మీరు ఎంతసేపైనా అక్కడ గడపండి. కానీ, సాయంత్రం 5 తర్వాత మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండవద్దని హెచ్చరిస్తారు. కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వచ్చి తన ప్రియురాలైన రాధా, తదితర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. కానీ.. అక్కడి ప్రజలు దీన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూడలేదు. దాని గురించి తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే.. గతంలో అలా ప్రయత్నించివారికి పట్టిన పరిస్థితి గురించి వారికి తెలుసు. 


ఔనండి.. నిధివన్‌లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్‌లోని చెట్ల వెనుక దాక్కొని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారట. తర్వాతి రోజు వారు షాక్‌తో మతిస్థిమితం కోల్పోయినవారిలా ప్రవర్తించారట. కొందరు చూపు, మాట కోల్పోయారట. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా.. భయానకంగా, మనస్సును కదిలించేదిగా ఉండవచ్చని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే, నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు తెరవరు. 


నిధివన్‌లో అడుగు పెడితే.. అక్కడ మీకు అనేక చెట్లు. రాత్రివేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారతాయని, తెల్లవారుజామున మళ్లీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. ఆ చెట్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ, అక్కడ మాత్రం రివర్స్. చెట్ల వేళ్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. నిధివన్ లోపల ‘రంగ్ మహల్’ ఆలయం ఉంటుంది. దీన్నే రాధా రాణి హ్రీంగర్-ఘర్ అని కూడా అంటారు. జానపద కథల ప్రకారం.. కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడు. తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే.. రంగ్ మహాల్ లోపల ఒక మంచం, దానికి సమీపంలో అనేక ఆభరణాలు, మేకప్ ఉత్పత్తులను చూడవచ్చు. 






నిధివన్ గురించి విని చాలా మంది కట్టుకథలు అని కొట్టిపడేస్తారు. కానీ, స్థానికులు ఇందుకు తామే సాక్ష్యమని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో చూడకపోవచ్చు. కానీ, ప్రతి రాత్రి ‘రంగ్ మహల్‌’లో ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జెల శబ్దాలు తమకు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ‘రంగ్ మహల్’లో ప్రతి రాత్రి దేవతల కోసం గంధపు చెక్కతో తయారు మంచాన్ని సిద్ధం చేస్తారు. పూజారులు తమల పాకు, వేప, వక్క, కూజా నీటిని మంచం పక్కన ఉంచుతారు. ఆ తర్వాత ఆలయానికి తాళాలు వేస్తారు. ప్రతి ఉదయం పూజారి ఆ ఆలయంలోకి వెళ్లినప్పుడు అవన్నీ అలంకరణలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. అందుకే రాధాకృష్టులు రోజూ ఆ ఆలయంలోకి వస్తారని భక్తులు నమ్ముతున్నారు. సాయంత్రం 5 గంటలు వరకు మాత్రమే ఆ ఆలయంలోకి అనుమతి ఉంటుంది. 5 తర్వాత పూజారులు ప్రసాదాన్ని 5 ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు. వాటిలో ఒక ముద్దను పూర్తిగా, రెండు ముద్దలు సగం తినేసినట్లుగా ఉంటాయి. ప్రతి రోజు ఆ ప్రసాదం ఈ విధంగానే వస్తుంది. ఇది కూడా అంతుబట్టని రహస్యమే. దీనికి సంబంధించిన వైరల్ వీడియోను ఇక్కడ చూడండి. 



Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి